Kota Srinivasa Rao : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఈ ఎన్నికల వేడి తగ్గలేదని చెప్పాలి. ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు, మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు ఒకరిపై ఒకరు పరస్పర మాటల యుద్ధం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కోట శ్రీనివాస్ రావు చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు.
అసలు కోట శ్రీనివాసరావు మనిషి కాదు.. వాడు ఒక జంతువు.. రేపోమాపో పోతాడు.. అతనికి ఎందుకు ఈ మాటలు.. అంటూ మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలపై కోటశ్రీనివాసరావు స్పందిస్తూ తనదైనశైలిలో కామెంట్లు చేశారు. తాను ప్రకాష్ రాజ్ ని మంచి నటుడు కాదని ఎప్పుడూ అనలేదని.. అతను కేవలం షూటింగ్‌లకు ఆలస్యంగా వస్తాడని మాత్రమే చెప్పానని తెలిపారు.
ఇక సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు నాగబాబు ఎవరు ? అంటూ ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా నాగబాబు మా అసోసియేషన్ లో ఉన్నా ఒరిగేది ఏమీ లేదంటూ నాగబాబు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక మోహన్ బాబు మాట మాత్రమే కర్కశంగా ఉంటుందని మనసు మంచిదని, నేను వారి సామాజిక వర్గాన్ని గౌరవిస్తానని తెలిపారు. గత నలభై సంవత్సరాలుగా కమ్మవారి భోజనం చేస్తున్నాను.. ఆ విశ్వాసంతోనే నా ఓటును మంచు విష్ణుకి వేశానని ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు మా ఎన్నికల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…