Balakrishna Car :టాలీవుడ్ సీనియర్ స్టార్స్‌లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఇన్నాళ్లూ వెండితెరపై సందడి చేసిన ఆయన ఇప్పుడు బుల్లితెరపై రచ్చ చేసేందుకు సిద్ధమయ్యారు. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఆహాలో అన్ స్టాపబుల్ అనే టాక్ షోతో బాలయ్య డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. దసరా పండగ సందర్భంగా ఈ టాక్ షో ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి బాలకృష్ణ ఓ లగ్జరీ కారులో రాగా.. ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది.
బాలయ్య కారు కంపెనీ పేరు బెంట్లీ కాగా.. ఈ కారును బాలకృష్ణకు ఆయన పెద్ద కూతురు నారా బ్రాహ్మణి బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ కారు విలువ రూ.4 కోట్ల వరకు ఉంటుందని అంచనా. గత కొద్ది రోజులుగా బాలకృష్ణ ఈ కారులోనే ప్రయాణిస్తున్నట్టు సమాచారం. ఇక ఆహాలో అన్ స్టాపబుల్ టాక్ షో 12 ఎపిసోడ్లుగా ప్రసారం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కో ఎపిసోడ్‌కు రూ.50 లక్షల చొప్పున రూ.6 కోట్ల వరకు బాలయ్య పారితోషికం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.
సినిమాల విషయానికి వస్తే నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను యాక్షన్ ఫిల్మ్ అఖండ చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. విడుదలకు రెడీ అవుతోంది. దీంతో బాలయ్య తదుపరి సినిమాపై ఫోకస్ చేశారట. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్‌లో రాబోతున్న ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో బాలయ్య మరోసారి ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కథలో మొత్తం రాయలసీమ, కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…