Oke Oka Jeevitham : ఒక సినిమా విజయవంతం అవడానికి ముందుగా మంచి రివ్యూలు.. ఆ తరువాత ప్రేక్షకుల మౌత్ పబ్లిసిటీ లాంటివి చాలా ముఖ్యమైనవి. ఒక్కోసారి రివ్యూలు బాగా లేనప్పటికీ వీక్షకులు ఆదరించినపుడు వారి నోటి ద్వారా సినిమాకు కావాల్సింనంత ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సినిమాకు ఇవి రెండూ బాగానే కలిసివచ్చినట్టగా తెలుస్తోంది.
ఈ చిత్రంపై సినీ విశ్లేషలకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. కొందరు ఈ సినిమాను ఎంతో మెచ్చుకోగా మరికొందరు ఈ చిత్రం సాగదీసినట్టుగా ఉందని విమర్శించారు. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రంలోని హీరో చాలా కాలం క్రితం ఒక యాక్సిడెంట్ వలన చనిపోయిన తన తల్లిని కలుసుకోవడానికి టైమ్ ట్రావెల్ చేయడం జరుగుతుంది. అప్పడు జరిగే సెంటిమెంటల్ ఇంకా ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దాని వలన వారు థియేటర్లకు రావడం పెరిగిందని విశ్లేషిస్తున్నారు.
ఇదే విధంగా ఈ మధ్యనే బింబిసార, సీతారామం సినిమాలు కూడా పాజిటావ్ టాక్ ఇంకా మౌత్ పబ్లిసిటీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అలాగే ఒకే ఒక జీవితం చిత్రం కూడా వివిధ వర్గాల ప్రేక్షకులకు నచ్చడంతో రోజురోజుకీ కలెక్షన్లను పెంచుకుంటూ బాక్సాఫీస్ విజయం దిశగా వెళ్తుందని భావిస్తున్నారు.
ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో బింబిసార, సీతారామం సినిమాల తరువాత మరొక విజయం రానుండడంతో నిర్మాతలు ఇంకా డిస్ట్రిబ్యూటర్లు ఆనందంగా ఉండటంతో పాటు, మంచి కథ కథనాలు ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…