Sonu Sood : సోనూసూద్ పేరుకు పరిచయం అక్కర్లేదు. సోనూసూద్ కి దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. సినిమాల్లో విలన్ పాత్రల్లో భయపెట్టిన సోనూ సూద్ నిజజీవితంలో మాత్రం ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ ఎందరికో సాయం చేసి తన మంచి మనసు చాటుకున్నాడు. కరోనా కల్లోల సమయంలో ఎంతోమందిని సోనూ ఆదుకున్న తీరు చూసి, తెరపై ఆయనను చూసి భయపడ్డవారే ఆనందంతో అభినందనలు తెలిపారు. రీల్ పై విలన్.. రియల్ లైఫ్ లో హీరో అంటూ కొనియాడారు. ప్రజలకు నిత్యం సాయం చేసేందుకు సూద్ ఛారిటీని కూడా నెలకొల్పారు.
సోనూ సూద్ అంతులేని సేవా కార్యక్రమాల్లో భాగంగా మరో ముందడుగు వేశారు. ఐఏఎస్ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారికి ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నారు. గతేడాది ఈ ఆన్‌లైన్ కోచింగ్‌ని ప్రారంభించారు సోనూసూద్. దాంట్లో భాగంగా ఈ ఏడాదికి కూడా కోచింగ్ ఇవ్వనున్నట్టు తెలిపారు. సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్ (ఎస్‌సీఎఫ్), డివైన్ ఇండియా యూత్ అసోసియేషన్ (డీఐవైఏ)ల సహకారంతో ఈ ఏడాదికిగాను సంభవం స్కాలర్‌షిప్ అనే కొత్త సెషన్‌ని ఆయన ప్రారంభించారు.
సంభవం అనేది ఐఏఎస్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం రూపొందించిన కార్యక్రమం. సోనూసూద్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలోని టాప్ సివిల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూట్లలో ఉచితంగా ఆన్ లైన్ ఐఏఎస్ కోచింగ్‌ని పొందుతారు. మెంటర్‌షిప్ సపోర్ట్ ని, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం, యువత సాధికారత ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ ఐఏఎస్ కావాలనుకునే పేద వారికి సమాన అవకాశాలు, సరైన జ్ఞానం అందించాలనేది మా ఉద్దేశ్యం అని తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…