NTR Samantha : కొన్ని పెయిర్స్ ఎప్పుడు, ఎక్కడ కనిపించినా కూడా ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచుతుంటాయి. అలాంటి పెయిర్స్‌లో ఎన్టీఆర్ – సమంత పెయిర్ ఒకటి. వెండితెరపై వీరిద్దరూ కలిసి బృందావనం, రామయ్య వస్తావయ్యా, జనతా గ్యారేజ్ వంటి చిత్రాలలో నటించి మెప్పించారు. ఇప్పుడు బుల్లితెరపై ఎన్టీఆర్‌తో కలిసి సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి సమంత చీఫ్ గెస్ట్‌గా హాజరైంది. దసరా నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను ప్రసారం చేయనున్నారు.
తాజాగా ప్రోమో విడుదల చేయగా ఇందులో ఎన్టీఆర్ – సమంతల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ‘కూర్చొంటే భయంగా ఉంది’ అని సమంత అనగా, ‘ఉంటుంది. ఇది హోస్ట్ సీట్.. అది హాట్ సీట్’ అంటూ ఎన్టీఆర్ సమాధానమిచ్చారు. ‘సాధారణంగా ఎవరైనా వెయ్యి నుంచి కోటికి వెళ్తారు.. నువ్వు కోటి నుంచి వెయ్యికి వస్తే ఆట బాగుంటుంది కదా’ అని ఎన్టీఆర్ అనడంతో సమంత నవ్వేసింది. ఆ తర్వాత ‘వదిలేయనా డబ్బు’ అని సమంత అనగా, ‘అయితే, క్విట్ అయిపోతావా’ అని ఎన్టీఆర్ అడిగారు. ‘మీరు ఇప్పుడు చెబుతున్నారు. ముందే చెప్పాలి కదా’ అని సమంత చెప్పుకొచ్చింది.
మంచి ఎంటర్‌టైనింగ్ గా కట్ చేసిన ఈ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో 2.2 మిలియన్ కి పైగా వ్యూస్ తో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇక ప్రోమోనే ఇంతలా సందడి చేస్తుంటే, ప్రోగ్రాం ఎంత రచ్చ చేస్తుందో చూడాలి. విడాకుల తరువాత సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్యపు వార్తలను పట్టించుకోకుండా తన మనోధైర్యంతో మొదటిసారిగా ఈ గేమ్ షోలో అతిథిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి తాను స్ట్రాంగ్ అని సమంత నిరూపించుకుంది. అందుకే ఈ షోపై అందరిలోనూ అంత ఆసక్తి నెలకొంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…