Maa : మా అసోసియేషన్ ఎన్నికలు రగిల్చిన రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన ప్రకాష్ రాజ్ తోపాటు ఆయనకు మద్దతుగా ఉన్న నాగబాబు ఇది వరకే రాజీనామా చేశారు. తమ రాజీనామాలను మా అధ్యక్షుడు మంచు విష్ణుకు ఇప్పటికే పంపించారు. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.
ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ నుంచి గెలుపొందిన శ్రీకాంత్, ఉత్తేజ్ సహా మొత్తం 11 మంది సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాము బయటనే ఉంటామని, మంచు విష్ణు తనకు ఇష్టం వచ్చిన వారిని మా సభ్యులుగా ఎంపిక చేసి వారందరితో కలిసి పనిచేయవచ్చని.. వారు ఏ పని చేసినా తాము చూస్తూనే ఉంటామని.. అయితే ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలను నెరవేర్చాలని.. మా సభ్యుల సంక్షేమానికి కృషి చేయాలని.. లేదంటే తాము ప్రశ్నిస్తామని తెలిపారు.
ఇక మా అసోసియేషన్ కు తాను చేసిన రాజీనామాను మంచు విష్ణు ఆమోదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. బయటి రాష్ట్రాలకు చెందిన వారు మా లో పోటీ చేయొద్దు, కేవలం సభ్యులుగా మాత్రమే ఉండాలని బై లాస్ మార్చితే తన రాజీనామాను ఆమోదించాలని, లేదంటే తాను తన రాజీనామాను వెనక్కి తీసుకుంటానని.. ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…