Varun Tej : తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ అండ్ డైనమిక్ హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ సినిమా గని. వినూత్నమైన పాత్రలకు విలువనిస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తూ పక్కా హిట్ మూవీస్ గా వరుణ్ తేజ్ దూసుకుపోతున్నాడు. మొదట్నుండి వరుణ్ స్టైల్ అదే. ముకుంద సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని కూడా అట్రాక్ట్ చేసే పాత్రలో నటించి ఎంటర్ టైన్ చేశారు. ఆ తర్వాత గద్దల కొండ గణేష్, ఎఫ్ 2 సినిమాల్లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ని సినీ ఇండస్ట్రీకి అందించారు. ఇప్పుడు గని సినిమాతో బాక్సర్ పాత్రలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు.
కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదలకు సిద్ధం చేశారు. పవర్ పాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గని టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ టీజర్ కు విశేష స్పందన లభించింది. అయితే ప్రస్తుతం వరుణ్ తేజ్ ఫ్యాన్స్ లో ఓ గందరగోళం నెలకొంది. ఎందుకంటే వరుణ్ తేజ్ సినీ కెరీర్ లో రిలీజైన కొన్ని సినిమాలు డిసెంబర్ నెలలోనే విడుదలై ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేకపోయాయి. లోఫర్, అంతరిక్షం లాంటి సినిమాలు డిసెంబర్ లోనే రిలీజై ఫ్లాప్ అయ్యాయి.
ఇప్పుడు వచ్చే సినిమాని కూడా డిసెంబర్ లో రిలీజ్ చేస్తే అది కూడా ఎలా అవుతుందోనంటూ భయపడుతున్నారు. మరి ఈ నమ్మకాలను బీట్ చేసేలా గని సినిమా హిట్ ను సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఫిట్ నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రముఖ నటులు ఉపేంద్ర, సునీల్ శెట్టిలు ఈ సినిమాలో కీ రోల్స్ లో నటిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…