NTR : చంద్రబాబు ఏడ్వడంపై ఎన్టీఆర్‌ స్పందన.. అరాచక పాలన అంటూ కామెంట్‌..

NTR : చంద్ర‌బాబుని అసెంబ్లీలో అవ‌మానించ‌డమే కాక ఆయ‌న భార్య గురించి త‌ప్పుగా మాట్లాడ‌డంతో చంద్ర‌బాబు మీడియా స‌మావేశంలో క‌న్నీరు పెట్టారు. దీనిపై తెలుగు త‌మ్ముళ్లు, నంద‌మూరి ఫ్యామిలీ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. రాజకీయం రాజకీయ నేతల మధ్య ఉండాలి. ఫ్యామిలీ మధ్య కాదు. చట్టసభల్లో ఉండి ఇలాంటి మాటలా అసెంబ్లీలో ఉన్నారా. గొడ్ల చావిడిలో ఉన్నారా.. అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు బాలయ్య.

ఇక తాజాగా ఎన్టీఆర్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా వీడియోతో స్పందించారు. ‘మాట.. మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణం. అవన్నీ ప్రజాసమస్యలపై జరగాలి కానీ వ్యక్తిగత దూషణలు, విమర్శలు ఉండకూడదు. నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఒక సంఘటన నా మనసును కలిచివేసింది. ఎప్పుడైతే మనం ప్రజాసమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో. ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పాలనకు నాంది పలుకుతుంది. అది తప్పు’ అని ఎన్టీఆర్‌ చెప్పారు.

‘స్త్రీ జాతిని గౌరవించడమనేది, మన ఆడపడచులను గౌరవించడమనేది మన సంస్కృతి. మన నవనాడుల్లో, జవజీవాల్లో, రక్తంలో ఇమిడిపోయినటువంటి సంప్రదాయం. అలాంటి సంప్రదాయాలను రాబోయే తరాలకు జాగ్రత్తగా, భద్రంగా అప్పజెప్పాలి. అంతేకానీ దాన్ని కాల్చేసి రాబోయే తరానికి బంగారు బాట వేస్తున్నామనుకుంటే అది చాలా పెద్ద తప్పు’ .‘ఈ మాటలు వ్యక్తిగత దూషణలకు గురైన బాధిత కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడటం లేదు.

ఒక కొడుకుగా, భర్తగా, తండ్రిగా, దేశపౌరుడిగా, ఒక తెలుగువాడిగా మాట్లాడుతున్నాను. రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపం చేస్తున్నా. దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి. ప్రజా సమస్యలపై పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా మన నడవడిక ఉండేలా జాగ్రత్తపడండి. ఇదే నా విన్నపం. ఇది ఇక్కడితో ఆగిపోతుందని కోరుకుంటున్నాను‘ అంటూ ఎన్టీఆర్‌ వీడియో సందేశం ఇచ్చారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM