Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ బాస్ షో ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదవ సీజన్ విజయవంతంగా నడుస్తోంది. ఇప్పటికే పది మంది ఎలిమినేట్ అవ్వగా.. తొమ్మిదో వారం విశ్వ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఎంతో స్ట్రాంగ్ అనుకున్న విశ్వ.. హౌస్ నుంచి వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యపరచింది. ఇక ఆ తర్వాత అనారోగ్యం కారణంగా జెస్సీ ఇంటి నుంచి పదవ వారంలో బయటకు వచ్చాడు.
11వ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ అభిమానులు. నాగిని డ్యాన్స్‌లు చేస్తూ, వెక్కిరిస్తూ, గట్టిగట్టిగా అరుస్తూ నానా రచ్చ చేసే అనీ మాస్టర్.. ఈ వారం హౌజ్ నుండి బయటకు రానుందని అంటున్నారు. బిగ్‌బాస్ నుంచి 11వ వారం అనీ మాస్టర్ ఎలిమినేట్ కావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి.
ఆమె ఇంటి నుంచి వెళ్లడానికి అంతా సిద్దమైందనే వార్తలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఒకవేళ అనీ మాస్టర్ ఈ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటే టాప్ 5లో చేరడానికి అవకాశాలు భారీగా ఏర్పడుతాయనే వాదన వినిపిస్తోంది.
ఈ వారం నామినేషన్‌లో కెప్టెన్‌గా ఉన్న రవి మినహా అందరూ నామినేట్ అయ్యారు. అయితే అందరిలోనూ కాజల్, అనీ, సిరిలు మాత్రం డేంజర్ జోన్‌లో ఉండగా.. సిరి సేవ్ అయ్యిందట. ఇక డేంజర్ జోన్‌లో ఉన్న కాజల్, అనీలలో కాజల్‌కు అనీతో పోల్చితే ఎక్కువ ఓట్లు రావడంతో కాజల్ సేవ్ అయ్యిందని.. దీంతో ఈ వారం అనీ మాస్టర్ ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. రేపు నాగార్జున ప్రకటించే వరకు ఎలిమినేషన్ అనేది కాస్త సస్పెన్సే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…