NTR : ఈ మధ్య మన హీరోలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుండడం అభిమానులలో ఆందోళన కలిగిస్తోంది. సాయిధరమ్ తేజ్ నుండి మొదలు పెడితే అడివి శేష్, రామ్, చిరంజీవి, బాలకృష్ణ వంటి వారు పలు కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ జిమ్‌లో గాయపడ్డట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మూడు, నాలుగు రోజుల క్రితం జిమ్‌లో ఎన్టీఆర్ కుడి చేతి వేలికి గాయం అయిందట.
వెంటనే ఆయన చేతికి చిన్నపాటి సర్జరీ చేయగా, కొద్ది రోజులు ఇంట్లో ఉండమని వైద్యులు సూచనలు కూడా చేశారట. ప్రస్తుతం ఎన్టీఆర్ క్షేమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీపావళి సందర్భంగా తన తనయులతో కలిసి దిగిన ఫొటోని ఎన్టీఆర్ షేర్ చేయగా, ఇందులో ఎన్టీఆర్ కుడి చేతి వేలికి కట్టు ఉండడం మనం గమనించవచ్చు. అయితే ఇదేమి అంత మేజర్ గాయం కాదని సన్నిహితులు అంటున్నారు.
ఎన్టీఆర్ కొద్ది రోజులుగా ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాంతో బిజీగా ఉన్నారు. ఈ షో చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఆయన కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చే ఓ సినిమాలో నటించనున్నారు. దీంతోపాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాకు సంతకం చేశారు. ఈ సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందనున్నాయని సమాచారం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…