Puneeth Rajkumar : పునీత్ మరణించి అప్పుడే వారం రోజులు అవుతోంది. ఆయన మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణ వార్త విన్న కొందరు అభిమానులు ఆత్మహత్యలు చేసుకోగా, ఇంకొందరు గుండెపోటుతో మరణించారు. రీసెంట్‌గా కోడిపాళ్యకు చెందిన భరత్(30) మంగళవారం ఉరివేసుకుని ‘అప్పుని’ కలవడానికి వెళుతున్నాను.. అంటూ రక్తంతో సూసైడ్ నోట్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అతని కోరిక మేరకు కుటుంబ సభ్యులు అతని కళ్లను దానం చేశారు.
పునీత్ మరణాన్ని ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. ఆయన తన సేవా కార్యక్రమాలతో అందరి మనసులలోనూ చెరగని ముద్ర వేసుకున్నారు. పునీత్ మరణించిన సమయంలో టాలీవుడ్‌కి సంబంధించి పలువురు ప్రముఖులు ఆయన పార్ధీవ దేహానికి నివాళులు అర్పించారు. ఆ సమయంలో రాలేకపోయిన నటుడు సూర్య.. తాజాగా పునీత్ సమాధి దగ్గర పూలు చల్లి నివాళులు అర్పించారు. ఆయన లేడని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇటీవల పునీత్ మృతిపై తమిళ హీరోలు ఎవరూ స్పందించడం లేదని ఓ వ్యక్తి విజయ్ సేతుపతిపై దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూర్య సందర్శించడం ఆసక్తికరంగా మారింది. కాగా.. ఇటీవలే హీరో నాగార్జున, రామ్ చరణ్ లు కూడా పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాసేపు వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. పునీత్ లేని లోటు పూడ్చలేనిదంటూ నాగార్జున, రామ్ చరణ్ అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…