T20 World Cup 2021 : దుబాయ్‌లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 37వ మ్యాచ్‌లో స్కాట్లండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. స్కాట్లండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ చాలా స్వల్ప వ్యవధిలోనే ఛేదించింది. 86 పరుగుల లక్ష్యాన్ని కేవలం 6.3 ఓవర్లలోనే భారత్ సాధించింది. దీంతో స్కాట్లండ్‌పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. స్కాట్లండ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఆ జట్టు 17.4 ఓవర్లలోనే కేవలం 85 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. స్కాట్లండ్ బ్యాట్స్‌మెన్‌లలో జార్జ్ మున్సీ 24 పరుగులు, మైకేల్ లియాస్క్ 21 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. మిగిలిన ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. ఇక భారత బౌలర్లలో మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజాలు చెరో 3 వికెట్లను తీశారు. జస్‌ప్రిత్ బుమ్రా 2 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 2 వికెట్లను కోల్పోయి 89 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో కేఎల్ రాహుల్ 50 పరుగులతో చెలరేగిపోయాడు. రోహిత్ శర్మ 30 పరుగులు చేశాడు. స్కాట్లండ్ బౌలర్లలో మార్క్ వాట్, బ్రాడ్ వియల్‌లు చెరొక వికెట్ తీశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…