RRR Movie : ప్రపంచమంతా ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుథిరం) సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలను పోషిస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లిష్ నటి ఒలివియా మోరిస్, హిందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మూవీని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇక ఈ సినిమా నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్‌తోపాటు శాటిలైట్ రైట్స్ ను బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఇక తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో డిజిటల్ రైట్స్ ను జీ5 దక్కించుకున్న విషయం తెలిసిందే.
జీ5 ఉత్తర భారతదేశంలో మంచి ఆదరణ సంపాదించుకోగా, దక్షిణ భారతదేశంలో పట్టుకోసం ప్రయత్నిస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇక్కడ కూడా సత్తా చాటాలని భావిస్తోంది. ఆర్ఆర్ఆర్ పైనే భారీ ఆశలు పెట్టుకున్న జీ5కి అంతా సానుకూలంగానే జరుగుతుందా.. అనేది చూడాలి. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదల కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…