NTR : గాయపడ్డ ఎన్‌టీఆర్‌.. రెండు నెల‌లు విశ్రాంతి తీసుకోమ‌న్న వైద్యులు.. సినిమాల ప‌రిస్థితి ఏంటి ?

NTR : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తాను పోషించే పాత్ర‌ల ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తార‌నే సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు.. వ్యాయమాలు చేయడం.. హెల్తీ ఫుడ్ తీసుకోవడం.. శరారీనికి ఎక్కువగా శ్రమ లేకుండానే.. తన ఫిట్ నెస్ కాపాడుకోవడానికి జూనియ‌ర్ ప్ర‌య‌త్నిస్తుంటాడు. కొర‌టాల శివ సినిమా కోసం ఆరు నుండి ఏడు కేజీల బ‌రువు త‌గ్గాల్సి ఉండ‌గా, ఇందుకోసం కొద్ది రోజులుగా ఇంట్లోని జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు.

జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో తారక్‌ చేతి వేలికి గాయమవ్వగా.. ఆసుపత్రిలో చిన్న సర్జరీ కూడా చేయించుకున్నారని సమాచారం. అయితే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదని, త్వ‌ర‌లోనే కోలుకుంటాడ‌ని వైద్యులు చెప్పిన‌ట్టు తెలుస్తోంది. అయితే వైద్యులు రెండు నెల‌ల పాటు ఎన్టీఆర్‌ని జిమ్‌, వ్యాయామం.. వంటి వాటికి దూరంగా ఉండాల‌ని చెప్పార‌ట‌. దీంతో కొర‌టాల సినిమాపై అనేక‌ ఊహాగానాలు నెల‌కొన్నాయి. ఎన్టీఆర్ గ‌త కొద్ది రోజులుగా ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ చిత్రంలో తారక్.. కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు.. ఈ సినిమా గురించి తారక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం చాలా భారీ కసరత్తులు చేశారు. ఎన్టీఆర్ వర్కవుట్స్‏కు సంబంధించిన వీడియో అప్ప‌ట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అందులో ఎన్టీఆర్‌ని చూస్తే ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతగా కష్టపడ్డాడో అర్ధ‌మైంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు అనే షోతోనూ బిజీగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్‌ కు రెస్ట్‌ అని వైద్యులు చెప్పడంతో ఆయన సినిమాల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. వాటిని 2 నెలలపాటు వాయిదా వేస్తారా ? అనే ప్రశ్న తలెత్తుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM