NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాను పోషించే పాత్రల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారనే సంగతి మనందరికీ తెలిసిందే. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు.. వ్యాయమాలు చేయడం.. హెల్తీ ఫుడ్ తీసుకోవడం.. శరారీనికి ఎక్కువగా శ్రమ లేకుండానే.. తన ఫిట్ నెస్ కాపాడుకోవడానికి జూనియర్ ప్రయత్నిస్తుంటాడు. కొరటాల శివ సినిమా కోసం ఆరు నుండి ఏడు కేజీల బరువు తగ్గాల్సి ఉండగా, ఇందుకోసం కొద్ది రోజులుగా ఇంట్లోని జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు.
జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో తారక్ చేతి వేలికి గాయమవ్వగా.. ఆసుపత్రిలో చిన్న సర్జరీ కూడా చేయించుకున్నారని సమాచారం. అయితే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదని, త్వరలోనే కోలుకుంటాడని వైద్యులు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే వైద్యులు రెండు నెలల పాటు ఎన్టీఆర్‌ని జిమ్, వ్యాయామం.. వంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పారట. దీంతో కొరటాల సినిమాపై అనేక ఊహాగానాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ గత కొద్ది రోజులుగా ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ చిత్రంలో తారక్.. కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు.. ఈ సినిమా గురించి తారక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం చాలా భారీ కసరత్తులు చేశారు. ఎన్టీఆర్ వర్కవుట్స్‌కు సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అందులో ఎన్టీఆర్‌ని చూస్తే ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతగా కష్టపడ్డాడో అర్ధమైంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోతోనూ బిజీగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ కు రెస్ట్ అని వైద్యులు చెప్పడంతో ఆయన సినిమాల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. వాటిని 2 నెలలపాటు వాయిదా వేస్తారా ? అనే ప్రశ్న తలెత్తుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.