Bigg Boss 5 : బిగ్ బాస్ కార్యక్రమం చూస్తుండగానే తొమ్మిది వారాలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే 19 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో చివరికి తొమ్మిది మంది హౌస్ నుండి ఎలిమినేట్ అయి10 మంది మాత్రమే మిగిలారు. ఈ క్రమంలోనే 9వ వారం ఎవరూ ఊహించని విధంగా హౌస్ నుంచి కండల వీరుడు విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఎవరూ ఊహించని విధంగా విశ్వ ఎలిమినేట్ కావడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.
ఇక ఎప్పుడూ ఆదివారం ఎంతో ఫన్ గా సాగే ఈ కార్యక్రమం తాజాగా కూడా ఎంతో సరదాగా సాగింది. నాగార్జున రావడంతోనే హౌస్ లో ఉన్న సభ్యులకు పలు టాస్క్ లు ఇచ్చి అందరినీ సందడి చేశారు. ఈ క్రమంలోనే నాగార్జున నేనెవరిని.. అనే గేమ్ ఆడించారు. ఈ టాస్క్ లో భాగంగా ఏ కంటెస్టెంట్ కైతే ఇతర కంటెస్టెంట్ పేరు వస్తుందో వారిలాగా ఇమిటేట్ చేసి చూపించాలి. అలా మిగతా వారు కరెక్ట్ గా గెస్ చేయాలి. ఇలా రవికి కాజల్ పేరు రావడంతో ఆమె ఎలా తింటుందో ఇమిటేట్ చేసి చూపిస్తూ కాజల్ పరువు మొత్తం తీసేశాఆడు. ఇలా హౌస్ లో ఉన్న సభ్యులు ఎంతో సరదాగా ఈ టాస్క్ పూర్తిచేశారు.
అనంతరం బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ విశ్వ అని చెప్పడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లతో సంబంధం లేదు, బయట ఉన్న ఫాలోయింగ్ ఇంపార్టెంట్ అని సన్నీ చెప్పకనే చెప్పేశాడు. ఇలా అందరితో చనువుగా ఉంటూ ఎంతో సునాయాసంగా టాస్క్ లను పూర్తి చేసే విశ్వ ఎలిమినేట్ కావడంతో హౌస్ సభ్యులు అందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.