Noise ColorFit Icon Buzz : ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్, వియరబుల్స్ తయారీదారు నాయిస్.. ఓ సరికొత్త స్మార్ట్ వాచ్‌ను భారత్ లో విడుదల చేసింది. నాయిస్ కలర్ ఫిట్ ఐకాన్ బజ్ పేరిట విడుదలైన ఈ వాచ్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో బ్లూటూత్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. 1.69 ఇంచుల ఫుల్ టచ్ ఫ్లాట్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది 240 x 280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది.

ఈ వాచ్‌లో 100కు పైగా కస్టమైజబుల్ అండ్ క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్ ఫీచర్‌ను అందిస్తున్నారు. 9 రకాల స్పోర్ట్స్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. రన్నింగ్, ట్రెడ్‌మిల్, వాకింగ్, స్పిన్నింగ్, సైక్లింగ్, యోగా, హైకింగ్, ఫిట్ నెస్ అండ్ క్లైంబింగ్ మోడ్స్ ఇందులో లభిస్తున్నాయి.
ఈ వాచ్‌లో రోజుకు 24 గంటలూ హార్ట్ రేట్‌ను పరిశీలించుకునే సదుపాయం అందుబాటులో ఉంది. అలాగే ఎస్‌పీవో 2 మానిటరింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. దీనికి వాయిస్ అసిస్టెన్స్ సదుపాయం లభిస్తుంది. దీంతో కాల్స్ చేసుకోవడంతోపాటు మ్యూజిక్ ప్లే చేయవచ్చు. వాతావరణం, ఇతర సమాచారం తెలుసుకోవచ్చు. ఇందులో 2 ఇన్‌బిల్ట్ గేమ్స్‌ను కూడా అందిస్తున్నారు. రిమోట్ మ్యూజిక్, కెమెరా కంట్రోల్స్ సదుపాయం ఉంది. ఐపీ 67 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను ఈ వాచ్‌కు అందిస్తున్నారు. దీని వల్ల నీటిలోనూ ఈ వాచ్ భేషుగ్గా పనిచేస్తుంది. పాడవదు.
నాయిస్ కలర్ ఫిట్ ఐకాన్ బజ్ వాచ్ 7 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. కాల్స్ చేసుకుంటే 2 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. ఈ వాచ్ జెట్ బ్లాక్, సిల్వర్ గ్రే, ఆలివ్ గోల్డ్, మిడ్‌నైట్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా.. దీని ధర రూ.3,499 ఉంది. అమెజాన్‌లో ఈ వాచ్ ను విక్రయిస్తున్నారు.