Kangana Ranaut : బాలాజీ ప్రొడక్షన్స్ పేరిట బాలీవుడ్‌లో నటి, దర్శక నిర్మాత ఏక్తా కపూర్ చక్రం తిప్పుతోంది. ఈ క్రమంలోనే ఆల్ట్ బాలాజీ అనే ఓటీటీ యాప్‌ను కూడా రన్ చేస్తోంది. అందులో ఎక్కువగా బి గ్రేడ్ కంటెంట్ ఉంటుంది. అలాంటి షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ ద్వారానే సదరు ఓటీటీ యాప్ పాపులర్ అయింది. అయితే అందులో త్వరలోనే ఓ ఫియర్‌లెస్ రియాలిటీ షోను నిర్వహించనున్నారని సమాచారం. ఇక దానికి హోస్ట్‌గా వివాదాస్పద నటి కంగనాను ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది.

అమెరికాలో హిట్ అయిన టెంప్టేషన్ ఐల్యాండ్ అనే డేటింగ్ షో ఆధారంగా సదరు ఫియర్‌లెస్ రియాలిటీ షోను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే దాన్ని భారతీయ ప్రేక్షకులకు అనుగుణంగా తీయనున్నారట. అందులో 15 మంది కంటెస్టెంట్లు పాల్గొంటారని, వారిలో పూనమ్ పాండే ఒకరని తెలుస్తోంది. ఆ షోలో మొత్తం అందాల ఆరబోతనే ఉంటుందని సమాచారం. ప్రముఖ మోడల్స్, బోల్డ్ హీరోయిన్స్‌తో ఈ షోను నిర్వహించనున్నారట. దీంతో ఈ షో సమ్మర్‌ను మరింత హీటెక్కిస్తుందని తెలుస్తోంది.
ఈ షోకు గాను త్వరలో షూటింగ్ ప్రారంభించి ఏప్రిల్ వరకు ముగిస్తారట. ఆ తరువాత వేసవిలో దీన్ని ప్రసారం చేస్తారని తెలుస్తోంది. ఇక కంగనా తొలిసారిగా ఓ షోకు హోస్ట్‌గా వ్యవహరించనుంది. మరి ఆమె ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఏది ఏమైనా ఈ బోల్డ్ షో ఓటీటీ యాప్‌లలో సెన్సేషన్ సృష్టిస్తుందని అంటున్నారు.