సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీలలో మెగా డాటర్ నిహారిక కొణిదెల ఒకరు. ఒకవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ, మరొకవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది నిహారిక. సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నిహారికకు ఫ్రెండ్ సర్కిల్ చాలానే ఉంది. స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ వరకు ఉన్న స్నేహితులతోపాటు, సినీ వర్గానికి సంబంధించిన స్నేహితులు కూడా ఎంతోమంది ఉన్నారు. నిత్యం టూర్లు, పార్టీలు అంటూ స్నేహితులతో తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది నిహారిక. ఇటీవల నిహారిక సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఒక మెసేజ్ అందరి దృష్టినీ ఆకర్షించింది.
నిహారిక స్నేహితుల గ్యాంగ్ లో కాల భైరవ కూడా ఒకరు. నిహారిక పెట్టిన మెసేజ్ చూస్తుంటే వీళ్ళ ఇద్దరికీ మంచి ప్రత్యేకమైన బంధం ఉందని అనిపిస్తోంది. కాలభైరవ కోసం నిహారిక చేసిన పోస్టులు చూసి నెటిజన్లు సైతం ఫిదా అయిపోతున్నారు. ఇంతకీ ఏంటా పోస్ట్ అనుకుంటున్నారా.. ఆ పోస్ట్ లో ఉన్న సారాంశం ఏమిటంటే..
హ్యాపీ బర్త్ డే భైరి బాబు.. నువ్వు నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. నువ్వు నా ప్రతి అవసరంలోనూ నాకు అండగా, తోడుగా ఉన్నందుకు థ్యాంక్స్.. ఈ ప్రపంచంలో సంతోషమంతా నీకు అందుకునే అర్హత ఉంది. ఐ లవ్యూ.. నీ అద్భుతమైన గాత్రంతో ఎన్నో చిత్రాలకు పాటలు పాడాలని ఆశిస్తున్నాను. అంతే కాకుండా ఎంతో మంచి సంగీతాన్ని అందించాలి.. అంటూ తన తరపున కాలభైరవకు విషెస్ తెలిపింది మెగా డాటర్ నిహారిక.
అంతేకాకుండా నిహారిక సీతారామం సినిమా చూసి ఎంతో ఎమోషనల్ అయిందట. ఈ చిత్రంలో ప్రొడక్షన్ డిజైన్ గానీ, దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం గానీ ఎంతో అద్భుతంగా ఉంది అంటూ పొగడ్తల వర్షం కురిపించింది. ఈ మధ్య కాలంలో విడుదలైన మంచి చిత్రాలలో ఇది ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతగానో ఆకర్షిస్తుంది, కచ్చితంగా చూడవలసిన చిత్రాలలో ఇది ఒకటి.. అంటూ చెప్పుకొచ్చింది నిహారిక.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…