గత కొంతకాలంగా టాలీవుడ్ లో సినిమాల కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. దీనికి తోడు యూనియన్ సమ్మె అని కొన్ని రోజులు, ఇప్పుడేమో నిర్మాతలు షూటింగ్ నిలిపివేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఈ శుక్రవారం విడుదలైన సీతారామం, బింబిసార బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి. కళ్యాణ్ రామ్ బింబిసార చిత్రం మార్నింగ్ షో నుంచి సానుకూల మౌత్ టాక్ రావడంతో పాటు బి & సి సెంటర్లలో భారీ కలెక్షన్స్ ను రాబడుతోంది. ఈ తరుణంలో ఈ సినిమా నిజానికి మాస్ మాహారాజ్ రవితేజదేనని టాక్ వినిపిస్తోంది.
ఒకప్పుడు రవితేజ పోకిరి, పటాస్ వంటి చిత్రాలను తిరస్కరించాడు. రవితేజ వదులుకున్న చాలా సినిమాలు చివరికి బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. మొదట దర్శకుడు వశిష్ట ఈ కథను రవితేజకు వివరించాడని, అయితే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడం వల్ల అతని కెరీర్‌పై పెద్ద ప్రభావం పడుతుందని భావించిన మాస్ హీరోకి అది నచ్చలేదని సమాచారం. అంతేకాకుండా ఒక కొత్త దర్శకుడు భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఎపిసోడ్ లను ఎలా హ్యాండిల్ చేస్తాడో అని అనుమానంతో కూడా బింబిసారను రవితేజ వదులుకున్నాడట.
రవితేజ దానిని తిరస్కరించడంతో.. దర్శకుడు కళ్యాణ్‌రామ్ ను కలిశాడని, తన సొంత సంస్థ అన్ని విజువల్ ఎఫెక్ట్ లను నిర్వహించగలదని కళ్యాణ్ రామ్ నమ్మాడట. అలాగే బింబిసార పాత్ర చాలా ఆసక్తికరంగా ఉందనే నమ్మకంతో నందమూరి హీరో ఈ సినిమాను చేశాడు. స్క్రిప్ట్, దర్శకుడిపై కళ్యాణ్‌రామ్ కు ఉన్న నమ్మకం ఇప్పుడు వర్క్ అవుట్ అయినట్లు కలెక్షన్స్ ను చూస్తే అర్ధమవుతోంది. దీంతో రవితేజ మూవీ లిస్ట్ లో మరో సూపర్ హిట్ మిస్ అయ్యింది. ప్రస్తుతం రవితేజ వరుస పరాజయాలతో.. ఓ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…