లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలే ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండేవి. వీటన్నింటికీ తెర దించుతూ ఎట్టకేలకు నయన్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకుని అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టింది. కొన్ని రోజులు భర్తతో హనీమూన్ కి వెళ్లి వచ్చిన అనంతరం మళ్లీ షూటింగ్ లో బిజీ అయింది నయనతార.
అయితే ప్రస్తుతం నయన్ రెమ్యూనరేషన్ గురించి చర్చ జరుగుతోంది. బాలీవుడ్‌కి చెందిన దీపికా పదుకొనె, ఆలియా భట్‌లను అధిగమించి దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే సూపర్‌స్టార్ నటిగా ఆమె అవతరించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ జీ స్టూడియోస్ క్రియేటివ్ డైరెక్టర్ ఎస్ శంకర్ శిష్యుడైన నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం నయనతారతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రం కోసం నయనతార రూ.10 కోట్లను తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు దీపికా పదుకొనె, ఆలియా భట్ ప్రధాన పాత్ర పోషించవలసి వస్తే ఒక్కో ప్రాజెక్ట్‌కి రూ.8-10 కోట్ల వరకు వసూలు చేస్తున్నారు. కానీ నయనతార రూ.10 కోట్లు తీసుకొని వారి కంటే ముందుండడం గమనార్హం. మెగాస్టార్ చిరు గాడ్ ఫాదర్, ప్రేమమ్ దర్శకుడి తదుపరి చిత్రం గోల్డ్ వంటి తన కమర్షియల్ ప్రాజెక్ట్‌ల కోసం నయన్ రూ.4-5 కోట్ల వరకు వసూలు చేస్తుండగా, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అంత మొత్తాన్ని డిమాండ్ చేస్తోంది.
నయన్ సక్సెస్ మూవీస్ తమిళ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.20 కోట్ల షేర్ ను వసూలు చేయడం, ఇతర హక్కులతో కలిపి నిర్మాతలు మరో రూ.20-30 కోట్లను సులభంగా పొందడంతో నయన్ అడిగిన మొత్తాన్ని ఇస్తున్నారట. ఒక హీరోయిన్ రూ.10 కోట్లు తీసుకోవడం అనేది గొప్ప విషయం. అందుకే అభిమానులు దట్ ఈజ్ నయన్ అని అభినందిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…