Chandra Hass : సినీ ఇండస్ట్రీలోకి హీరోగా తనని తను వెండితెరపై చూసుకోవడానికి ఎంతో మంది యువకులు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. కొందరు ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తమకంటూ మంచి గుర్తింపు సాధించి స్టార్ హీరోగా ఎదిగినవారు ఎంతో మంది ఉన్నారు. మరికొందరు సినిమా బ్యాక్ గ్రౌండ్ తో తమ తొలి చిత్రంలోనే ఈజీగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిపోతారు. ఎంతమంది ఎలా వచ్చినా ఇండస్ట్రీలో హీరోలుగా నిలబడాలంటే కేవలం హీరో కటౌట్ఉంటే సరిపోదు.
అంతేకాకుండా తమకు తామే హీరో అని ప్రచారం చేసుకున్నా అంత ఈజీగా ఇండస్ట్రీలో స్థిరపడలేరు. ఇండస్ట్రీలో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు ఎంతోమంది వాళ్లను హీరోలుగా ప్రూవ్ చేసుకుందామని ఎంత ట్రై చేసినా కూడా దానికి తగ్గ టాలెంట్ ఉన్నప్పుడు మాత్రమే వారు ఇండస్ట్రీలో ఉండగలరని ఎన్నో సందర్భాలు తెలియజేశాయి. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలోకి సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఓ 22 ఏళ్ళ యంగ్ కుర్రాడు హీరోగా డెబ్యూకి రెడీ అయిపోయాడు.

అంతేకాకుండా తన మొదటి సినిమా అనౌన్స్ మెంట్ లోనే ఏకంగా మూడు సినిమాలకు సంబంధించిన అనౌన్స్ చేయడం విశేషం. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లకు కూడా తెలీదు నాలాంటి హీరో ఇండస్ట్రీలో ఉన్నట్లు అంటూ బిల్డప్పులు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఇంతకీ ఎవరా అప్ కమింగ్ తోపు హీరో అనుకుంటున్నారా ? ఆ హీరో ఎవరో కాదు.. ప్రముఖ బుల్లితెర నటుడు, సినీ దర్శకుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్. ఇటీవల చంద్రహాస్ 22వ బర్త్ డే సందర్భంగా ప్రభాకర్ ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి హీరోగా తన తనయుడు డెబ్యూ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అలాగే చంద్రహాస్ టాలెంట్ చూసి మొదటి సినిమాకు ముందే మరో రెండు సినిమాలు అధికారికంగా ఓకే అయ్యాయని చెప్పడం మరీ విశేషం.
ఇప్పుడు చంద్రహాస్ విషయానికి వస్తే మొదటి ఇంట్రడక్షన్ స్పీచ్ తోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఇంట్రడక్షన్ తరవాత చంద్రహాస్ గురించి జనాలు కామెడీగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సైతం చంద్రహాస్ ను ట్రోల్ చేయడం పనిగా పెట్టుకున్నారు. నాటు నాటు కవర్ సాంగ్ ద్వారా చంద్రహాస్ తన డాన్స్ టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు. మరి యాక్టింగ్ స్కిల్స్ గురించి తెలియాలంటే అతను నటించిన చిత్రం విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. చంద్రహాస్ మాత్రం ప్రస్తుతం ట్రోలర్స్ కి, మీమర్స్ కి మంచి హాట్ టాపిక్ లా మారాడు. ఇంట్రడక్షన్ స్పీచ్ లో చంద్రహాస్ తాను నలుగురిని నవ్విస్తే చాలు అని చెప్పడంతో మీమర్స్ అంతా చంద్రహాస్ ని ట్రోల్ చేస్తూ నెటిజన్స్ ని నవ్వించే పనిలో పడ్డారు.