Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ బ్యూటీ నటిస్తున్న సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సమంత సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నప్పటి నుండి ఆమె వ్యక్తిగత జీవితం మీద ఫోకస్ ఎక్కువైంది. మీడియాలో పలు రకాల కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా సమంత రెండో పెళ్లికి సిద్ధమవుతోంది అనే వార్త వైరల్ అవుతుంది. దీని వెనుక ఆధ్యాత్మికవేత్త సద్గురు ఉన్నారట. ఆయనే సమంతను రెండో పెళ్ళికి ఒప్పించారని, ఒక అబ్బాయిని కూడా ఫిక్స్ చేశారనే టాక్ నడుస్తుంది.
అయితే ఈ వార్త నిజం కాదు అని కొందరి అభిప్రాయం. ఇదంతా కొందరు కావాలని సృష్టిస్తున్న పుకారు అంటున్నారు. స్వయంగా సమంత పీఆర్ టీం కూడా ఈ న్యూస్ వెనుక ఉండే అవకాశం ఉందట. ఓ వైపు నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోనున్నాడని కథనాలు వెలువడుతుండగా, సమంత పెళ్లిని తెరపైకి తెచ్చారని అంచనా. బలమైన కారణంతో విడిపోయిన నాగ చైతన్య-సమంతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తమ పీఆర్ ల ద్వారా ఒకరిపై మరొకరు దుష్ప్రచారం చేయిస్తున్నారనే వాదన ఉంది. ఆ మధ్య నాగ చైతన్య.. హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో అఫైర్ నడుపుతున్నాడన్న వార్త గుప్పుమంది. ఈ ఆరోపణలపై సమంత నేరుగానే స్పందించింది.

ఒక అమ్మాయి మీద వచ్చే పుకార్లు నిజాలు.. అబ్బాయి మీద వస్తే అవి ఉద్దేశపూర్వకంగా ఒక అమ్మాయి చేయిస్తున్నట్లు.. అని అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్ పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో సమంత రెండో పెళ్లి వార్తల వెనుక ఆమె పీఆర్ టీం ఉండవచ్చని అంచనా. నాగ చైతన్య ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడని జరుగుతున్న ప్రచారానికి దీటుగా సమంత పెళ్లి పుకార్లను తెరపైకి తెచ్చారు అంటున్నారు. మరోవైపు గత అనుభవాల రీత్యా సమంత ఇకపై పెళ్లి చేసుకోకూడని నిర్ణయించుకుందనే వాదన కూడా ఉంది. సామ్ పై రోజుకో వార్త పుట్టుకొస్తున్న తరుణంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయంలో ఉన్నారు నెటిజన్లు.