Amma Rajasekhar : డ్యాన్స్ మాస్టర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్.. నటుడు నితిన్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్న విషయం విదితమే. అమ్మ రాజశేఖర్ స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం.. హై5. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఆయన నితిన్‌ను చీఫ్ గెస్ట్‌గా పిలిచారు. అయితే తన మాచర్ల నియోజకవర్గం మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉండడం వల్ల ఈవెంట్‌కు రాలేకపోతున్నానని నితిన్ తెలిపాడు. కానీ దీన్ని రాజశేఖర్ సీరియస్‌గా తీసుకున్నారు. హై5 ప్రీరిలీజ్ వేడుకలో నితిన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.
ఒరేయ్ నితిన్.. నీకు డ్యాన్స్ కూడా రాదురా.. నీకు డ్యాన్స్ నేర్పిన గురువుని నేను. నన్ను నువ్వు ఈరోజు అవమాన పరిచావు. నా సినిమాకు నిన్ను చీఫ్ గెస్ట్‌గా పిలిస్తే వస్తానన్నావు. దీంతో నేను నీ కోసం ఏవీ కూడా చేయించాను. తీరా చూస్తే జ్వరం వచ్చిందని ఫోన్‌లో చెబుతూ అబద్దాలు చెబుతున్నావు.. కనీసం బైట్ అయినా ఇవ్వమని అడిగితే కుదరదు అన్నావు.. నీ గురువు పట్ల నువ్వు చూపించే మర్యాద ఇదేనా.. అంటూ అమ్మ రాజశేఖర్ నితిన్‌పై మండిపడ్డారు.

అయితే నితిన్‌ను ఇంతలా దూషించినా ఆయన మాత్రం స్పందించలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం రాజశేఖర్‌నే తిట్టిపోస్తున్నారు. నువ్వు తీసిన హై5 మూవీ బి గ్రేడ్ మూవీ. అందులో అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయి. అలాంటి సినిమాను ప్రమోట్ చేయవద్దనే నితిన్ నీ సినిమా ఫంక్షన్‌కు రాలేదు. నువ్వు డ్యాన్స్ నేర్పానంటున్నావు.. మరి నువ్వు నితిన్‌తో తీసిన టక్కరి సినిమా ఎందుకు దొబ్బింది.. అంటూ నితిన్ ఫ్యాన్స్.. రాజశేఖర్‌పై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే అమ్మ రాజశేఖర్ అనవసరంగా నితిన్‌ను దూషించి తన పరువు తానే పోగొట్టుకున్నాడని అంటున్నారు.
కాగా నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం మూవీ ఆగస్టు 12న రిలీజ్ కానుంది. ఇందులో నితిన్‌కు జోడీగా కృతిశెట్టి, క్యాథరిన్ ట్రెసా నటించారు.