Anasuya : బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా సత్తా చాటుతున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ ఫొటోల ద్వారా తన ఫాలోవర్లను అలరిస్తుంటుంది. అయితే అనసూయ అప్పుడప్పుడు నెటిజన్ల విమర్శలకు గురవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు ఆమెను నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఆమె లేటెస్ట్‌గా పోస్ట్ చేసిన ఫొటోలపై నెటిజన్లు దారుణమైన కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
అనసూయ తరచూ సోషల్ మీడియాలో తన ఫొటోలను పోస్ట్ చేసినట్లుగానే తాజాగా మళ్లీ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అయితే ఈ ఫొటోల్లో ఆమె లుక్ వేరే విధంగా ఉంది. ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయి. మేకప్ కూడా సరిగ్గా లేదు. జుట్టు కూడా అదో మాదిరిగా ఉంది. దీంతో నెటిజన్లు తమ నోళ్లకు పని చెప్పారు. అనసూయ నువ్వు బాగా ఏజ్ బార్ అయిపోయావు, ముసలమ్మలా కనిపిస్తున్నావు.. అంటూ ఆమెపై దారుణమైన కామెంట్లు పెడుతున్నారు.

అయితే వాస్తవానికి అనసూయ ఎప్పుడు ఫొటోలను అప్‌లోడ్ చేసినా వాటిల్లో తన ఏజ్ కనిపించనీయకుండా చేస్తుంది. ఆమె యువతిలా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఆమెకు 37 ఏళ్లు. అయితే ఇది పెద్ద వయస్సు కాదు. కానీ కొన్ని సార్లు ముఖంలో గ్లామర్ తగ్గుతుంది. అందుకు అనేక కారణాలు ఉంటాయి. కొందరు చిన్న వయస్సులోనే వృద్ధుల్లా కనిపిస్తారు. అనసూయ కూడా ఇప్పుడు అలాగే కనిపిస్తుందని నెటిజన్లు అంటున్నారు. అయితే కొందరు మాత్రం ఆమెకు సపోర్ట్ ఇస్తున్నారు. ఫొటోల ఎడిటింగ్ లేదా ఫొటోలను తీయడంలో ఎక్కడో తేడా కొట్టి ఉంటుందని.. అనసూయ ఎల్లప్పుడూ గ్లామర్‌గానే ఉంటుందని అంటున్నారు. మరి దీనిపై ఆమె స్పందిస్తుందా.. లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.