Sreeleela : పెళ్లి సందD అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటీ శ్రీలీల. ఈ అమ్మడు చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ ఆఫర్లు మాత్రం వరుస కడుతున్నాయి. ఈ క్రమంలోనే పలు వరుస సినిమాల షూటింగ్‌లతో ఈమె ఎంతో బిజీగా ఉంది. ఇక తాజాగా ఇంకో సినిమాలో ఈమె హీరోయిన్‌గా నటించనుంది. శ్రీలీల తన 20వ జన్మదినాన్ని జరుపుకుంటున్న సందర్భంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తమ సినిమాలో ఈమె నటిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలిపారు.
శ్రీలీల సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై తెరకెక్కుతున్న సినిమాలో నటించనుంది. ఇందులో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించనున్నాడు. అనగనగా ఒక రోజు పేరిట ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకు థమన్ ఎస్ మ్యూజిక్ అందిస్తుండగా.. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే శ్రీలీల ఇది కాకుండా ఇంకా పలు సినిమాల్లోనూ ప్రస్తుతం యాక్ట్ చేస్తోంది. పెళ్లి సందD మూవీ అనంతరం ఈమె ఎంబీబీఎస్ ఫైనలియర్ ఎగ్జామ్స్ రాసేందుకు ముంబై వెళ్లింది. దీంతో కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. ప్రస్తుతం పలు సినిమాలతో ఈమె బిజీగా ఉంది.

కన్నడలో 2019లో వచ్చిన కిస్ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి ఈ బ్యూటీ పరిచయం అయింది. తరువాత కన్నడలోనే భారతి అనే సినిమా చేసింది. అనంతరం తెలుగులో పెళ్లి సందD చేసింది. దీంతో ఈమె దశ తిరిగింది. ప్రస్తుతం రవితేజతో కలిసి ధమాకా అనే మూవీలో నటిస్తోంది. అలాగే వారాహి చలన చిత్రం ప్రొడక్షన్‌లో ఇంకో ద్విభాషా చిత్రంలోనూ ఈమె నటిస్తోంది. ఇలా శ్రీలీల ప్రస్తుతం మామూలుగా సందడి చేయడం లేదు. వరుస సినిమాలతో ఎంతో బిజీగా మారింది.