Shahrukh Khan : ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ)కి పట్టుబడిన విషయం విదితమే. ముంబై తీర ప్రాంతంలో ఓ క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారంటూ అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించిన ఎన్‌సీబీ అధికారులు ఆర్యన్ సహా పలువురు ప్రముఖులకు చెందిన పిల్లలు మొత్తం 11 మందిని అరెస్టు చేశారు.
కాగా ఆర్యన్‌ఖాన్‌ను విచారణకు కస్టడీకి అనుమతించాల్సిందిగా ఎన్‌సీబీ కోర్టును కోరింది. అందుకు కోర్టు కూడా అంగీకరించింది. దీంతో ఈ సంఘటన బాలీవుడ్‌ను భారీగా కుదిపేస్తోంది. మరోవైపు షారుఖ్ అభిమానులు ఆయనకు మద్దతుగా విస్టాండ్‌విత్ షారూఖ్ పేరిట హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు షారుఖ్‌కు మద్దతుగా నిలిచారు.
అయితే భారీ ఎత్తున నెటిజన్లు మాత్రం షారుఖ్‌ను, అతని కుమారుడు ఆర్యన్‌ను విడిచిపెట్టడం లేదు. వారిద్దరినీ దారుణంగా విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. తండ్రేమో బైజూస్‌లో చదువుకోమని విద్యార్థులకు పాఠాలు చెబుతుంటే.. కొడుకేమో డ్రగ్స్ తీసుకుంటున్నాడు.. అని కామెంట్లు చేస్తున్నారు.
అయితే 1997లో షారుఖ్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను యుక్త వయస్సులో ఎంజాయ్ చేయలేకపోయానని, కనుక తన కుమారుడికి అన్నింటినీ ఎంజాయ్ చేసే స్వేచ్ఛను కల్పిస్తానని తెలిపాడు. డ్రగ్స్ తీసుకోవడం, అమ్మాయిలతో గడపడం వంటి చేసేందుకు తన కుమారుడికి అనుమతిస్తానని షారుఖ్ అన్నాడు. దీంతో అప్పట్లో షారుఖ్ యాదృచ్ఛికంగానే ఆ వ్యాఖ్యలు చేసినా.. ఇప్పుడు అన్నంత పనీ అయింది. దీంతో అప్పటి వీడియోల తాలూకు క్లిప్స్ ను నెటిజన్లు షేర్ చేస్తూ.. షారుఖ్ ను ఇంకా దారుణంగా విమర్శిస్తున్నారు. ఓ తండ్రి ఇలాంటి మాటలేనా మాట్లాడాల్సింది, కొడుకును ఈ విధంగానేనా తయారు చేయాల్సింది ? అని ప్రశ్నిస్తున్నారు.
అయితే రేపో మాపో ఆర్యన్ ఖాన్‌ను బాలీవుడ్ లో తెరంగేట్రం చేయాలని షారుఖ్ భావించారు. అంతలోనే ఈ విధంగా జరగడం వారికి పెద్ద షాక్ ను ఇచ్చిందని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…