Maa : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఒకరికి మించి ఒకరు ఎత్తులు వేస్తూ ప్రచారంలో ముందుకు సాగిపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు రోజు రోజుకీ మాటల యుద్ధం పెంచారు. ఇక తాజాగా ప్రకాష్ రాజ్.. మంచు విష్ణుకు మద్దతు ఇచ్చిన నరేష్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. దీంతో హీట్ మరింత పెరిగింది.
అయితే ‘మా’ ఎన్నికలపై అటు ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికలకు, ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అలాగే ‘మా’ ఎన్నికలకు, వైసీపీకి, సీఎం జగన్‌కు కూడా ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. దీంతో మంత్రి పేర్ని నాని గత కొద్ది రోజులుగా వారిపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని కుండ బద్దలు కొట్టారు.
కాగా పవన్, జనసేన సానుభూతి పరులు, టీడీపీ నాయకులు గత కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్, మంత్రులపై ‘మా’ ఎన్నికల గురించి ఆరోపణలు చేస్తున్నారు. ‘మా’ ఎన్నికల్లో వారు కలగజేసుకుంటున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పుడు మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయంపై తేల్చేయడంతో.. ప్రత్యర్థులు ఇంకా ఏమైనా కొత్త అస్త్రాలు సంధిస్తారేమో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…