Manchu Lakshmi : శాండిల్ వుడ్ పవర్ స్టార్, హీరో పునీత్ రాజ్ కుమార్ మరణించారు. అక్టోబర్ 29న శుక్రవారం ఉదయం కన్నడ నటుడు పునీత్ కుమార్ ఛాతీ నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పగా ఆయన్ను వెంటనే బెంగుళూరులోని విక్రమ్ హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. అక్కడ వైద్యులు పునీత్ రాజ్ కుమార్ కు వైద్యం అందిస్తుండగానే చివరి శ్వాస విడిచారు. పునీత్ రాజ్ కుమార్ మరణ వార్తతో సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురైంది. ఈ వార్తపై సోషల్ మీడియాలో ఎంతోమంది నెటిజన్లతోపాటు సినీ సెలబ్రిటీస్ కూడా తమ సంతాపం తెలియజేస్తున్నారు.
వీరిలో మంచు లక్ష్మీ కూడా ఉన్నారు. కానీ ఈమె చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆమె చేసిన ట్వీట్ లో ఓఎంజీ.. నో.. ఇది నిజం కాకూడదు. అలా ఎలా అవుతుంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. మీ ఆత్మకు శాశ్వత శాంతి కలగాలి. చాలా త్వరగా చనిపోయారు.. అంటూ పునీత్ రాజ్ కుమార్ పేరును చేర్చారు. ఈ ట్వీట్ పునీత్ అభిమానుల్ని షాక్ తోపాటుగా బాధకు గురిచేసింది. మంచు లక్ష్మీ పాపులర్ ఉన్న నటి కనుక ఏం చేసినా ఊరుకోవాలా అంటూ మండిపడ్డారు. వైద్యుల నుండి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకుండా పోస్ట్ ఎలా చేస్తుంది.. అంటూ మండిపడుతున్నారు.
OMG!!!!!!!! Nooooooo. This can’t be true! How can this be? My deepest condolences to the family. May your soul rest in eternal peace. Gone too soon 💔 #PuneethRajkumar
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) October 29, 2021
అసలు ఈ గందరగోళ వార్తలేంటి అంటూ నెటిజన్స్ అడిగిన ప్రశ్నకు మంచు లక్ష్మీ చేసిన పోస్ట్ ను తర్వాత తొలగించారు. అసలు నిజం తెలియకుండా ఇలా పోస్టులు పెడుతున్నందుకు అభిమానులు ఆమెపై మండిపడ్డారు. వైద్యులు మీడియాని ఉద్దేశించి మాట్లాడుతూ.. పునీత్ కు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని అన్నారని, బెంగుళూరు విక్రమ్ హాస్పిటల్ బయట భారీ సంఖ్యలో పునీత్ అభిమానులు వచ్చి ఆయన క్షేమం కోసం ఎన్నో రకాలుగా ప్రార్థించారని పునీత్ చిన్న కుమారుడు అన్నారు. పునీత్ ప్రస్తుతం కూడా ద్విత అనే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. గతంలో యూ టర్న్ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.