Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్, స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో బెంగళూరు లోని విక్రమ్ ఆసుపత్రిలో ఈ ఉదయం అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. వైద్య నిపుణులు ఆయనకి వెంటి లెటర్ పై చికిత్స అందించినా ఉపయోగం లేకుండా పోయింది. జిమ్ చేస్తుండగా ఆయనకు గుండె పోటు రావడంతో విక్రమ్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ఆయన కన్నుమూశారు. పునీత్ మృతికి కేవలం శాండిల్ వుడ్ నుంచే కాక తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సెలబ్రిటీలు సైతం సంతాపం వ్యక్తం చేస్తున్నారు..
మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబుతోపాటు పలువురు స్టార్ హీరోలు పునీత్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే షాక్ అయ్యాను. పునీత్ మరణం రాజ్ కుమార్ కుటుంబానికి తీరని లోటు. చిన్న వయసులోనే పునీత్ కు ఇలా జరగడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. పునీత్ నాకు అత్యంత ఆప్తుడు, వారి కుటుంబంలోని వారంతా తనకు కావాల్సిన వారు. బెంగళూరు వెళ్ళినప్పుడల్లా పునీత్ చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణ వార్త తెలియగానే నా నోట మాట కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు చిరంజీవి.
Shocking ,devastating & heartbreaking! #PuneethRajkumar gone too soon. 💔
Rest in Peace! My deepest sympathies and tearful condolences to the family. A huge loss to the Kannada / Indian film fraternity as a whole.Strength to all to cope with this tragic loss!— Chiranjeevi Konidela (@KChiruTweets) October 29, 2021
ఇక మహేష్ బాబు కూడా స్పందించారు. పునీత్ మరణ వార్త విని షాకయ్యాను అని తెలిపారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు మహేష్.