Neha Sharma : మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో మెగా పవర్‌స్టార్ రాంచరణ్ డెబ్యూ మూవీ చిరుతతో తెరంగేట్రం చేసింది బీహార్ బ్యూటీ నేహాశర్మ. ఫస్ట్ మూవీలోనే అందాల ఆరబోత గట్టిగా చేసి ఆకట్టుకుంది. మొదటి చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ఆ వెంటనే ఈమెకు వరుణ్ సందేశ్ సరసన కుర్రాడు అనే సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో తర్వాత టాలీవడ్ లో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. అనంతరం బాలీవుడ్ లో క్రూక్, తేరీ మేరీ కహానీ వంటి సినిమాల్లో నటించింది.
అవి కూడా నేహాకు మంచి పేరుని తెచ్చిపెట్టలేదు. తమిళ్, పంజాబీ సినిమాల్లో నటించింది కానీ అవి కూడా ఈమెకు కలిసి రాలేదు. తన గ్లామర్ ను మాత్రం అలాగే మెంటైన్ చేస్తూ వస్తుంది. ఫస్ట్ మూవీలో ఎలాగైతే ఉందో.. ఇప్పటికి అదే గ్లామర్ తో రచ్చ చేస్తుంది నేహాశర్మ. ప్రస్తుతం ఈమెకు అవకాశాలు లేవనే చెప్పాలి. దానికి కారణం అమ్మడు స్టోరీ సెలక్షన్ బాగా లేకపోవడం వల్లనే అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో.. నేహాశర్మ ట్రెండింగ్ టాపిక్ అయ్యింది.
హాట్ ఫోటోషూట్స్ చేస్తున్న నేహాశర్మ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని తెలుస్తుంది. ఆమె పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు బాలీవుడ్ ప్రొడ్యూసర్.. అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఓ యంగ్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ తో డేటింగ్ లో ఉన్న నేహాశర్మ త్వరలోనే పెళ్లి చేసుకొని ఓ ఇంటిది కాబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఏదైతేనేం పెళ్లి చేసుకొని ఒక ఇంటిది కాబోతోంది నేహా శర్మ అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎలాగూ సినిమాలు లేవు, పెళ్లి చేసుకొని అయినా సెటిల్ అవ్వు నేహా.. అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…