Krishnam Raju : రెబల్ స్టార్ కృష్ణం రాజు క‌న్నుమూత‌.. టాలీవుడ్‌లో తీవ్ర విషాదం..

Krishnam Raju : టాలీవుడ్ ఇండస్ట్రీలో మ‌రో విషాదం చోటు చేసుకుంది. రెబల్‌స్టార్‌ కృష్ణం రాజు (83) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర‌ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున 3:25 గంటలకు కృష్ణం రాజు మరణించారు. దీంతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ శోక సంద్రంలో మునిగిపోయింది.

కాగా కృష్ణంరాజు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు.1940 జనవరి 20న జన్మించారు. కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు. ఆయన 183కు పైగా చిత్రాలలో నటించారు. కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన కృష్ణంరాజు వాజ్‌పేయ్‌ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అలాగే 2004లో లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చెందిన కృష్ణంరాజు.. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 1966లో చిలకా గోరింక చిత్రంతో సినీ ఎంట్రీ ఇచ్చారు. రెబల్‌స్టార్‌గా కృష్ణంరాజుకు సినీ ఇండస్ట్రీలో మంచి పేరుంది.

Krishnam Raju

హీరోగా సినీ రంగ ప్రవేశం చేసి విలన్‌గానూ అలరించారు. కృష్ణంరాజు కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్‌ను ఏలారు. కాగా సోమవారం హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. 1977,1984లో నంది అవార్డును గెలుచుకున్నారు. 1988లో తాండ్రపాపారాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. కృష్ణంరాజు సొంత‌పేరు ఉప్పల‌పాటి వెంక‌ట కృష్ణంరాజు కాగా తెలుగు సినిమా క‌థానాయ‌కుడిగా, నిర్మాత‌గా, రాజ‌కీయ‌వేత్తగా వెలుగు వెలిగిన కృష్ణంరాజు తుదిశ్వాస విడవడం అంద‌రినీ క‌ల‌చి వేస్తోంది. ఇక ఈ విష‌యం తెలియ‌గానే ప్రభాస్ హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్నారు.

కృష్ణం రాజు మొదటి భార్య సీతాదేవి క‌న్నుమూశారు. దీంతో 1996లో శ్యామ‌లా దేవిని ఆయ‌న రెండో వివాహం చేసుకున్నారు. అమరదీపం, భక్త కన్నప్ప వంటి చిత్రాలు ఆయ‌న‌కు గొప్ప న‌టుడిగా పేరు తెచ్చిపెట్టాయి. కాగా కృష్ణం రాజు ప్ర‌భాస్‌కు పెద‌నాన్న అవుతారు. ఆయ‌న బిరుదు రెబ‌ల్ స్టార్‌తోనే ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సినిమాల్లో కొన‌సాగుతున్నారు. అయితే ప్ర‌భాస్ పెళ్లి చూడాల‌నేది ఆయ‌న కోరిక‌. అది తీర‌కుండానే ఆయ‌న వెళ్లిపోయారు.

Share
Editor

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM