Krishnam Raju Assets : రెబల్ స్టార్‌గా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న కృష్ణం రాజు కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. దాదాపుగా 60 ఏళ్ళకి పైగా కృష్ణం రాజు సినీ కెరీర్ కొనసాగగా.. ఆయన ఎన్నో హిట్ చిత్రాలను అందించారు. రెబల్ స్టార్‌గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది చిత్రాల్లో నటించారు. రౌద్ర రసం, కరుణ రసం పండించడంలో ఆయనకి ఆయనే సాటి అని చెప్పవచ్చు.
కాగా కృష్ణం రాజు మృతితో అభిమానులు ఆయన జీవితాన్ని తలచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కృష్ణం రాజు ఆస్తుల గురించి చర్చించుకుంటున్నారు. కృష్ణం రాజు 1940 జనవరి 20న మొగల్తూరులో ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రాజు, లక్ష్మీ దేవి దంపతులకు జన్మించారు. వీరిది మొదటి నుంచి ధనిక కుటుంబమే. రాజ వంశానికి చెందినవారు. ఇక కృష్ణం రాజుకి వారసత్వంగా మొగల్తూరులో వందల ఎకరాల భూమి ఉందట. అలాగే మొగల్తూరులో ఒక భవనం, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో మొత్తం నాలుగు ఖరీదైన ఇల్లు ఉన్నాయట.
ఇక కృష్ణం రాజు ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్నారు. ఆ ఇంటి ఖరీదు రూ.18 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు హైదరాబాద్ లో కృష్ణం రాజుకి ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. ఇక గోపీకృష్ణ అనే నిర్మాణ సంస్థని కూడా కృష్ణం రాజు స్థాపించారు. కృష్ణం రాజు రూ.90 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ కారు, రూ.40 లక్షలు విలువైన టొయోటా ఫార్చునర్ కారు, రూ.90 లక్షల విలువైన వోల్వో ఎక్స్‌సి లాంటి కార్లను వాడుతున్నారు. అలాగే కృష్ణం రాజుది రాజుల కుటుంబం కాబట్టి వారి ఇంట్లో ఎప్పుడూ విందులు, పార్టీలు గ్రాండ్ గా జరుగుతూనే ఉంటాయి.
కృష్ణం రాజు లేదా ప్రభాస్ ఎవరైనా సరే.. తమ ఇంటికి అతిథులు ఎవరు వచ్చినా.. నోరూరించే వంటకాలతో విందు భోజనం పెట్టిస్తారు. అందువల్లనే వారి విందుకు చాలా మంది ఫిదా అవుతుంటారు. ఇక ప్రభాస్ కూడా కృష్ణం రాజు లాగే షూటింగ్ సమయాల్లోనూ అందరికీ ఇంటి నుంచి వండిన విందు భోజనాన్ని తెప్పించి వడ్డిస్తుంటారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటీనటులు కూడా ప్రభాస్ ఆతిథ్యానికి పడిపోయారు. ఇక ప్రభాస్ ఆస్తి విలువ రూ.600 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు ప్రభాస్ పెదనాన్ననే మించిపోయేలా సంపాదిస్తున్నాడు. కృష్ణం రాజుకి మొత్తం ముగ్గురు కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి ఉన్నారు. కుమారులు లేరు. అందువల్ల ప్రభాస్ ఆయన అంత్యక్రియలను దగ్గరుండి చేస్తారని తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…