Ananya Pandey : ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఇప్పటికే ఎన్నో ఊహించని మలుపులు తిరిగింది. బుధవారం ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై విచారించిన ముంబై కోర్టు అతనికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ వస్తుందని షారూఖ్ ఎంతగానో ఎదురు చూశారు. ఆఖరికి జైలు వద్ద వాహనాలను కూడా ఏర్పాటు చేయించారు. అయినప్పటికీ చివరి నిమిషంలో ఎన్‌సీబీ కీలక ఆధారాలు కోర్టులో ప్రవేశపెట్టడంతో కేసు చాలా బలంగా ఉందని భావించిన కోర్టు ఆర్యన్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
అయితే ఆర్యన్ ఖాన్‌కు చెందిన వాట్సాప్ చాట్‌లను ఎన్‌సీబీ కోర్టులో ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. అందులో ఆర్యన్ పలువురితో డ్రగ్స్ విషయమై చాటింగ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆర్యన్ పలువురికి డ్రగ్స్ సరఫరా చేస్తాడని.. ఆ చాట్స్ ద్వారా నిర్దారణ అయినట్లు తెలుస్తోంది. అందుకనే కోర్టు బెయిల్ ఇవ్వలేదని సమాచారం.
అయితే ఆర్యన్ ఖాన్ చాట్‌లలో ఒక హీరోయిన్‌తో చేసిన చాట్‌ల గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఆర్యన్ ఖాన్ షిప్పులో ఉన్నప్పుడు బాలీవుడ్‌కు చెందిన ఔత్సాహిక హీరోయిన్‌తో డ్రగ్స్ విషయమై వాట్సాప్ లో చాట్ చేసినట్లు తెలిసింది. అయితే ఆ హీరోయిన్ ఎవరా ? అని బుధవారం అంతా చర్చ జరిగింది. కానీ గురువారం బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఇంట్లో ఎన్‌సీబీ సోదాలు నిర్వహిస్తుండడంతో.. ఆ హీరోయిన్ ఆమే అని స్పష్టమవుతోంది. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగిందని చెప్పవచ్చు.
ఇక అనన్య పాండే ఇంట్లో ఎన్‌సీబీ అధికారులకు ఏమైనా సాక్ష్యాలు లభిస్తాయా ? ఆమె ఫోన్ ను సీజ్ చేస్తారా ? అన్నది తెలియాల్సి ఉంది. అనన్య ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన లైగర్ అనే మూవీలో చేస్తోంది. దీనికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…