Kota Srinivasa Rao : టాలీవుడ్ సీనియర్ సినీ నటుల్లో కోట శ్రీనివాసరావు కూడా ఒకరు. మొదట్నుండి ఈయన వ్యవహార శైలి వేరుగానే ఉంటోంది. ప్రస్తుతం ఈయన టాలీవుడ్ లో పలువురిపై కామెంట్స్ చేయడం షాకింగ్ గా మారింది. రీసెంట్ గా బుల్లితెర యాంకర్ అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ పై కోట శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ గురించి తెలిసిందే. అలాగే మా ఎన్నికల క్రమంలో ప్రకాష్ రాజ్ ని టార్గెట్ చేశారు. ఎందుకంటే కోట శ్రీనివాసరావు.. మా ఎలక్షన్స్ లో మంచు విష్ణుకు సపోర్ట్ చేశారనే విషయం పబ్లిక్ గానే తెలుసు.
ప్రకాష్ రాజ్ తో కలిసి దాదాపుగా తాను 15 సినిమాల్లో వర్క్ చేసినా.. ఆయన ఒక్కసారి కూడా టైమ్ కి వచ్చింది లేదని కామెంట్స్ చేసిన విషయమూ తెలిసిందే. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో నాగబాబు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు లేకపోతే నాగబాబు అనేవాడు ఎవరు ? అంటూ ప్రశ్నించారు. ఆయనేమీ గొప్ప నటుడు కాదంటూ కామెంట్ చేశారు. గతంలో తాను ప్రకాష్ రాజ్ ని అనడంతో నాగబాబు తనను విమర్మించారని మండి పడ్డారు. అసలు నేను నాగబాబుని ఏమైనా కామెంట్ చేశానా.. రీసెంట్ గా ఆయన నాపై చేసిన కామెంట్స్ కి నేను టీవీ ఛానెల్స్ లో స్పందించి ఉంటే పెద్ద గొడవయ్యేదని కోట శ్రీనివాసరావు అన్నారు.
అలాగే అప్పుడు ఒక మాట, ఇప్పుడొక మాట చెప్పనని.. ఎప్పటికీ ఒకే మాట మీద ఉంటానని.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు కనుక లేకపోతే నాగబాబు ఎవరో కూడా జనాలకు తెలీదని అన్నారు. ఇప్పటికీ ఆయన్ను ఎవరైనా సంబోధించాలంటే మెగా బ్రదర్ అనే అంటారని వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ పై చేసిన కామెంట్స్ కి కోట శ్రీనివాసరావును టార్గెట్ చేస్తూ.. కొంతమందికి వయస్సు పెరుగుతుంది గానీ.. బుద్ది పెరగడం లేదంటూ పోయే వయస్సుకు దగ్గరపడినా ఇంకెప్పుడు మారతారో అంటూ హీట్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పై నాగబాబును పలువురు నటీనటులు తప్పు పట్టారు. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో మా ఎలక్షన్స్ అనేవి ఎంతోమంది నటుల్ని హైలెట్ చేశాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…