Aryan Khan : ముంబై సముద్ర ప్రాంతంలో క్రూయిజ్ షిప్‌పై దాడులు నిర్వహించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు ఆర్యన్ ఖాన్ సహా పలువురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. తాజాగా ఆర్యన్ ఖాన్ మరోమారు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ఆర్యన్ ఖాన్ ఏమో గానీ.. ఈ కేసు మొత్తం బాలీవుడ్ మెడకు ఉచ్చులా బిగుసుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎన్‌సీబీ అధికారులు తాజాగా కోర్టుకు ప్రవేశపెట్టిన ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్‌లలో కీలకవిషయాలు ఉన్నట్లు తెలిసింది. ఆర్యన్ ఖాన్ ఓ బాలీవుడ్ ఔత్సాహిక హీరోయిన్‌తో డ్రగ్స్ విషయమై చాటింగ్ చేసినట్లు ఎన్‌సీబీ అధికారులు గుర్తించారని అందుకనే కోర్టు బెయిల్ ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే ఆ హీరోయిన్ అనన్య పాండేనేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆమె ఇంట్లో ఎన్‌సీబీ సోదాలు నిర్వహిస్తుండడమే ఇందుకు కారణం.
ఇక అనన్య పాండేతోపాటు ఇంకా అనేక మంది ఈ ఉచ్చులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బాలీవుడ్‌లో చాలా మందికి డ్రగ్స్ సరఫరా చేసేవాడని ఎన్‌సీబీ ప్రవేశపెట్టిన చాట్‌లలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మరింత మంది బాలీవుడ్ తారలపై త్వరలో ఎన్‌సీబీ రైడ్స్ చేస్తుందని తెలుస్తోంది.
ఆర్యన్ ఖాన్ చాట్‌లలో అనేక మంది బాలీవుడ్ తారల పేర్లు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కొక్కరిగా ఎన్‌సీబీ త్వరలోనే అందరిపై దాడులు నిర్వహిస్తుందని సమాచారం. ఆర్యన్ ఖాన్ ఎవరెవరితో చాట్ చేశాడు ? అన్న వివరాలు బయటకు రాకుండా ఎన్‌సీబీ జాగ్రత్త పడుతోంది. ఈ క్రమంలో ఈ కేసు రోజు రోజుకీ మరింత సంచలనంగా మారుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…