Aryan Khan : ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి ముంబై సముద్ర తీరంలో ఓ క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్, గంజాయి, కొకెయిన్ సరఫరా అవుతుందన్న సమాచారం మేరకు ఎన్‌సీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఈ క్రమంలోనే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
కాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్‌ను విచారణ నిమిత్తం అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ఆర్యన్ ఖాన్‌కు ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. తరువాత అతన్ని ప్రశ్నించనున్నారు.
షారుఖ్‌ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు అవడం సంచలనం సృష్టిస్తోంది. ఇటీవలి కాలంలో అటు బాలీవుడ్ సహా ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే ఆర్యన్ ఖాన్ అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు సూత్రధారులను వదిలేసి చిన్న చేపలను పట్టుకున్నారని ఆరోపిస్తోంది. కాగా ఈ కేసులో ఆర్యన్ తో పాటు మరో 10 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం అందుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…