Manchu Vishnu : అటు ప్రకాష్ రాజ్.. ఇటు మంచు విష్ణు.. ఇద్దరూ మా ఎన్నికల్లో భాగంగా ప్రచారం పెంచారు. ఇద్దరూ తమ తమ ప్యానెల్ మెంబర్లతో కలిసి మా సభ్యులను కలుస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు బాలయ్య బాబును కలిశారు. ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. అందుకు బాలయ్య బాబు కూడా అంగీకరించారు.
ప్రస్తుతం బాలకృష్ణ అఖండ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మంచు విష్ణు బాలకృష్ణను కలిశారు. అయితే మంచు విష్ణుకు బాలకృష్ణ తన మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన థమ్సప్ చూపించారు.
బాలకృష్ణ తనకు మద్దతు ఇస్తున్నందుకు గాను మంచు విష్ణు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు విష్ణు ట్వీట్ చేశారు. మా ఎన్నికల్లో తనకు మద్దతు ఇస్తున్నందుకు నట సింహం, బాల అన్నకు ధన్యవాదాలు, మీ మద్దతు నాకు లభించడం నిజంగా గర్వంగా ఉంది.. అంటూ విష్ణు ట్వీట్ చేశారు. కాగా మా ఎన్నికలు అక్టోబర్ 10వ తేదీన జరగనున్నాయి. మంచు విష్ణు ఈ ఎన్నికల్లో మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…