NTR : ఎన్టీఆర్ పేరు చెబితేనే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. ఇక ఆయన బొమ్మ సినిమాలో పడిందంటే చాలు.. మినిమం 100 రోజులు గ్యారంటీ. అలా ఎన్‌టీఆర్ సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే ఎంత సెలబ్రిటీ అయినా కొన్ని సార్లు ఫ్లాపులు తప్పవు. సినిమా మొత్తం అన్నీ బాగానే ఉన్నప్పటికీ పలు భిన్న కారణాల వల్ల కొన్ని సార్లు అగ్ర హీరోల సినిమాలు కూడా ఫ్లాప్‌లుగా మారుతుంటాయి. కొన్ని యావరేజ్‌గా ఆడుతుంటాయి.
ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన కెరీర్‌లో అట్టర్ ఫ్లాప్స్ లేకున్నా కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి. కొన్ని యావరేజ్‌గా నడిచాయి. కొన్ని అబోవ్ యావరేజ్ గా నడిచాయి. ఇక కొన్ని మూవీలు బంపర్ హిట్‌లుగా నిలిచాయి. ఎన్టీఆర్, వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన సాంబ హిట్ కాలేదు కానీ అబోవ్ యావరేజ్ టాక్‌ను సంపాదించుకుంది.
కంటెంట్ మంచిగానే ఉంది. ఎన్‌టీఆర్ ఫామ్‌లో ఉన్నారు. వినాయక్ కూడా ఠాగూర్ తీసి అప్పట్లో జోష్‌లో ఉన్నారు. ఇక హీరోయిన్స్ కూడా సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన వారే. కానీ సాంబ మూవీ హిట్ కాలేకపోయింది. అబోవ్ యావరేజ్ టాక్‌ను సంపాదించింది. అందుకు రెండు కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు.
ఎన్‌టీఆర్‌కు చెందిన గత సినిమాల కన్నా సాంబ మూవీలో హింస మరీ ఎక్కువైందని అప్పట్లో టాక్ వినిపించింది. ఇక వదినలపైనే అత్యాచారం చేయబోయిన మరుదులను అందుకు సపోర్ట్ చేసిన అన్నలను అందులో చూపించారు. ఇవి ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో మూవీ అబోవ్ యావరేజ్ గా నిలిచింది.
అయితే సీన్లపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకునేది. ఈ మూవీలో ఉన్న వదిన, మరుదుల సీన్‌పై వినాయక్ ఇప్పటికీ చెబుతూనే ఉంటారు. ఆ సీన్లను తీయకపోయినా బాగుండేది.. అని అంటుంటారు. అందువల్ల సాంబ మూవీ హిట్ కాలేకపోవడానికి ఆ రెండు అంశాలను బలమైన కారణాలుగా చెప్పవచ్చు. లేదంటే ఎన్‌టీఆర్ ఖాతాలో మరో బంపర్ హిట్ పడి ఉండేది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…