Nara Rohith : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా వైసీపీ ప్రజా ప్రతినిధులు తనపై తన సతీమణి భువనేశ్వరిపై దారుణమైన వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు నాయుడు విలపించిన విషయం విదితమే. అయితే ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ తీవ్ర దూమారం రేపుతోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ నుంచి వాకౌట్ అయిన చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో భోరున విలపించారు. ఇక ఈ ఘటనపై పలువురు సినీ హీరోలు స్పందిస్తున్నారు.
ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్ ఈఘటనపై స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా నటుడు నారా రోహిత్ స్పందించారు. అధికారంలో ఉన్న కొందరు నేతలు పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారని, ప్రజా సమస్యలపై చర్చలు జరగాల్సిన సభలో అధికార పక్షం.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరిలను ఉద్దేశించి అసభ్య పదజాలంతో మాట్లాడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు.
రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్ర హక్కును దుర్వినియోగం చేస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడటం సబబు కాదని రోహిత్ అన్నారు. శిశుపాలుడి మాదిరిగానే వైసీపీ నాయకుల 100 తప్పులు పూర్తయ్యాయని, ఇక తెలుగుదేశం కార్యకర్తలు వైసీపీ దుశ్శాసనుల భరతం పట్టే సమయం ఆసన్నమైందని, స్థాయి లేని వ్యక్తుల మధ్య రాజకీయాలు చేయాల్సి రావడం దురదృష్టకరం పెదనాన్న.. అంటూ నారా రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…