Pawan Kalyan Venkatesh : టాలీవుడ్‌లో మల్టీ స్టారర్ క్రేజ్ నడుస్తోంది. స్టార్ హీరోలు కూడా ఎక్కువ ఆసక్తి చూపుతుండడంతో అనేక మల్టీ స్టారర్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. త్వరలో పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్ చిత్రం రూపొందనుందనే టాక్ నడుస్తోంది. త్రివిక్రమ్‌కి పవన్ కళ్యాణ్, వెంకటేష్‌లతో చాలా సాన్నిహిత్యం ఉంది.
ఇప్పుడు త్రివిక్రమ్.. పవన్, వెంకటేష్ లతో మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ చేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై త్రివిక్రమ్.. పవన్, వెంకటేష్‌లతో సంప్రదింపులు జరిపించాడట. వారిద్దరూ ఈ చిత్రం చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుందని అంటున్నారు. గతంలో పవన్ – వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన గోపాల గోపాల చిత్రం మంచి విజయం సాధించడంతో ఇప్పుడు తాజా మల్టీ స్టారర్‌పై ఆసక్తి నెలకొని ఉంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వకీల్ సాబ్ సినిమాతో మరోసారి సంచలనం సృష్టించిన పవన్.. ఇప్పుడు రీమేక్ చిత్రాలపై ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రస్తుతం పవర్ స్టార్.. మలయాళం రీమేక్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిస్తున్న భీమ్లా నాయక్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో రానా కీలక పాత్రలో నటిస్తుండగా.. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. త్వరలో త్రివిక్రమ్.. మహేష్ బాబుతో సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…