Nani : సినిమా ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంటర్ అయి ఆ తర్వాత అష్టా చమ్మా సినిమా ద్వారా హీరోగా వెండితెరపై సందడి చేసిన నాచురల్ స్టార్ నాని హిట్లు, ప్లాపులు సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. నాని ఎంతో సహజంగా నటిస్తూ నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. కేవలం అసిస్టెంట్ డైరెక్టర్ గా, హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా పలు సినిమాలను నిర్మించి మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇదిలా ఉండగా నాని గతంలో వీ అనే సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించి తనలో ఉన్న మరో యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. తాజాగా మరోసారి పూర్తి నెగెటివ్ పాత్రలో, విలక్షణ నటుడి పాత్రలో నటించడానికి నాని సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమిళంలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న విజయ్ తలపతి ఈసారి నేరుగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో విలన్ పాత్రలో నాచురల్ స్టార్ నాని నటించబోతున్నట్లు సమాచారం. ఇందులో విజయ్ సరసన కియారా లేదా రష్మిక హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. హీరోగా ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్న నాని విలన్ పాత్రలో ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారో వేచి చూడాల్సిందే. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన అధికారికంగా వెలువడనున్నట్లు సమాచారం.