Bigg Boss 5 Telugu : బుల్లితెరపై ప్రసారమవుతున్న తెలుగు బిగ్ బాస్ కార్యక్రమం ప్రతి రోజూ కంటెస్టెంట్ ల మధ్య గొడవలు, కొట్లాటల మధ్య ఎంతో రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కొందరు సెలబ్రిటీలు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు మద్దతు తెలుపుతూ తన అభిమానులకు కూడా వారికి మద్దతు తెలపాలంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు తన పూర్తి మద్దతు ప్రియాంక సింగ్ కి ఉందని, తన అభిమానులు కూడా తనకే మద్దతు తెలిపి తనని గెలిపించాలని గతంలో తెలియజేశారు. ఈ క్రమంలోనే టిక్ టాక్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన దుర్గారావు కూడా తన మద్దతు యాంకర్ రవికి ఉందని గతంలో తెలియజేశారు. తాజాగా నటుడు సందీప్ కిషన్ కూడా బిగ్ బాస్ హౌస్ లో తన మద్దతును కంటెస్టెంట్ మానస్ కి తెలిపాడు.
https://www.instagram.com/reel/CUXPEn_J38R/?utm_source=ig_web_copy_link
ఈ సందర్భంగా ఓ వీడియోలో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. హలో నేను మీ సందీప్ కిషన్.. బిగ్ బాస్ హౌస్ లో నాకు నచ్చిన, నాకు బాగా కావాల్సిన వ్యక్తి మానస్ నాగులపల్లి. ఎంతో మంచి మనసున్న అతను మీ అందరికీ నచ్చుతాడు, మానస్ చాలా మంది మనసులు గెలుచుకుని బయటకు వస్తాడని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.. ఆల్ ది బెస్ట్ లవ్ యూ.. అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియో పాతది అయినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.