Sai Dharam Tej : రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వివిధ రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకసారి తాను కోలుకుంటున్నాడని, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పగా.. మరోసారి తాను ఇప్పటికీ కళ్ళు తెరవలేదని కోమాలోనే ఉన్నాడంటూ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అందరినీ అయోమయంలోకి నెట్టేశాయి.

ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య విషయంపై సంగీత దర్శకుడు ఎస్ఎ స్ తమన్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. తన ట్విటర్ ఖాతాలో తేజ్ హెల్త్ అప్‌డేట్ ఇచ్చాడు. ”మీ ప్రార్థనలు ఫలిస్తున్నాయి. నా స్నేహితుడు సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు. త్వరలోనే మిమ్మల్ని కలవడానికి ఎదురు చూస్తూ ఉంటాను..” అంటూ తమన్ ట్వీట్ చేశారు.
తమన్ ఈ విధంగా సాయి తేజ్ ఆరోగ్యం గురించి చెప్పడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తేజ్ ఆరోగ్య విషయంలో దర్శకుడు దేవా కట్టా కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ ఆవేశపూరితంగా చెప్పడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారని.. తేజ్ ఆరోగ్య విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం ఏమాత్రం లేదని.. ఈ సందర్భంగా వెల్లడించారు.