Jabardasth Apparao : జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అప్పారావు అలియాస్ ఆసమ్ అప్పి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అప్పారావు తాను చేసే స్కిట్ లతో ప్రేక్షకులను ఎంతో సందడి చేసేవారు. అలాగే ప్రముఖ హీరోల సినిమాలలోనూ నటిస్తూ వెండితెరపై సందడి చేస్తున్నారు.

కాగా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ గురించి అప్పారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సందర్భంలో హీరో ప్రభాస్ ని కలిసినప్పుడు తను వెళ్ళి తెలుగులో మాట్లాడితే ఇంగ్లీష్ లో మాట్లాడాడని, అలాగే తెలుగు, హిందీలో కూడా మాట్లాడుతూ అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్లిపోయారని తెలియజేశారు.
అదే విధంగా అప్పారావు ” లయ” సినిమాను షూటింగ్ చేస్తున్న సమయంలో ప్రభాస్ కూడా అక్కడే ఉండటంతో వెళ్లి నమస్తే బాబు అనీ ప్రభాస్ ను పలకరించగా.. ఆయన లేచి నిలబడి తనను పలకరించి.. అనంతరం ప్రొడక్షన్ వారిని పిలిచి వారి చేత కుర్చీ తెప్పించి కూర్చోబెట్టారని.. అంతవరకు ప్రభాస్ నిల్చుని తనతో మాట్లాడారని.. ఓ సందర్భంలో తెలియజేశారు. నిజానికి ప్రభాస్ నిలబడాల్సిన అవసరం లేదు.. అయినా ఆయన వ్యక్తిత్వం అదంటూ అప్పారావు ప్రభాస్ గురించి తెలియజేశారు.