Namrata Shirodkar : టాలీవుడ్ సూపర్ స్టార్స్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఫ్యామిలీల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. ఈ ఇద్దరు హీరోలకు అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా, వారి అభిమానులు వీరిని జంటగా చూడాలని కలలు కంటున్నారు. కానీ అదైతే ఇప్పటి వరకు జరగలేదు కానీ ఒకరినొకరు పలు సందర్భాలలో విష్ చేసుకున్నారు. ఆ మధ్య దీపావళి పండగ సందర్భంగా.. శుభాకాంక్షలు తెలియజేస్తూ పలువురు సినీ ప్రముఖులకు కానుకలు పంపారు పవన్ కల్యాణ్.
సూపర్ స్టార్ మహేశ్ కుటుంబానికి ప్రత్యేకమైన గిఫ్ట్ అందించారు. ఇందులో పర్యావరణానికి హాని చేయని గ్రీన్ క్రాకర్స్ తో పాటు స్వీట్స్ ఉన్నాయి. ఈ విషయాన్ని మహేశ్ సతీమణి నమ్రత సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కానుకలు పంపినందుకు పవన్కు థ్యాంక్స్ చెప్పారు. ఇక క్రిస్మస్ కానుకగా పలు గిఫ్ట్స్ పంపించారు పవన్. దర్శకుడు వేణు శ్రీరామ్ దంపతులకి విషెష్ చెబుతూ గిఫ్ట్ పంపించారు పవన్.
దీనిని శ్రీరామ్ వేణు సతీమణి సోషల్ మీడియాలో వీడియో ద్వారా షేర్ చేశారు. పవన్ పంపిన గ్రీటింగ్స్ బాక్స్ ని ఓపెన్ చేసి అందులో ఏమేం ఉన్నాయో చూపించి పవన్ కి ధన్యవాదాలు తెలిపారు. ఇక మహేష్ కుటుంబానికి కూడా పవన్ దంపతులు ప్రత్యేకమైన గిఫ్ట్‌లతోపాటు గ్రీటింగ్స్ ని పంపించారు. ఈ గ్రీటింగ్స్ ని మహేష్ సతీమణి నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ లో పెట్టి ఈ లవ్లీ హాంపర్ ని పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…