Bigg Boss : అన్ని ప్రాంతీయ భాషలలోనూ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో ఐదు సీజన్స్ పూర్తి చేసుకొని త్వరలో ఆరో సీజన్ జరుపుకునేందుకు సిద్ధమైంది. ఇది కాకుండా ఓటీటీలో తెలుగు బిగ్‌బాస్ షో రాబోతుందని దానికి బాలకృష్ణ హోస్టింగ్ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. తాజాగా ఈ వార్తలపై నాగార్జున స్పందించారు. ఇప్పటివరకూ చూసిన బిగ్‌బాస్ షోకి.. ఓటీటీలో చూడబోయేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. రెండూ విభిన్నమైన ఫార్మాట్లు అని అన్నారు.
బిగ్‌బాస్ ఓటీటీ గురించి ఇంకా చర్చలు జరుపుతున్నాం. షో ఎలా ఉండాలి ? ఎంతమంది కంటెస్టెంట్స్ ? ఎన్ని రోజులు ? మిగిలిన విషయాలన్నింటి గురించి చర్చించుకుంటున్నాం. అన్నీ ఓకే అనుకున్నాక వచ్చే నెలలో ప్రకటిస్తాం అని తెలిపారు నాగ్. ఈ షోకి వ్యాఖ్యాతగా అడుగుపెట్టే సమయంలో ఏదో తెలియని భయం.. కానీ అడుగుపెట్టాక.. నేను కూడా ఈ షోకి అభిమానిగా మారిపోయాను. సీజన్-3, 4 పూర్తయ్యాక కంటెస్టెంట్స్ చాలామంది మా ఇంటికి వచ్చి.. షో మాకెంతో నేర్పించింది. మేము లైఫ్‌లో ఎంతో సక్సెస్ అయ్యాం అని చెబుతుంటే నేనెంతో ఆనందించాను.
డిస్నీ హాట్‌స్టార్ యాజమాన్యం నావద్దకు వచ్చి.. ‘బిగ్‌బాస్ ఓటీటీ ప్రారంభించాలనుకుంటున్నాం అని చెప్పడంతో షాక్ అయ్యాను. చివరికి వాళ్లు ఒప్పించారు. బిగ్‌బాస్‌కి పూర్తి విభిన్నంగా ఈ షో ఉంటుంది. సుమారు 6 కోట్ల మంది బిగ్‌బాస్ చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిగ్‌బాస్ షోలన్నింటిలో మన తెలుగు షోనే సూపర్‌హిట్. త్వరలోనే ఓటీటీ ప్రారంభం కానుందని నాగార్జున అన్నారు.
అయితే బిగ్‌బాస్ తదుపరి సీజన్‌కు బాలకృష్ణ హోస్ట్‌గా వస్తారని ప్రచారం జరుగుతుంది కదా.. దానిపై మీ స్పందన ఏమిటి ? అని ప్రశ్నించగా.. అందుకు నాగ్ బదులిస్తూ.. బిగ్‌బాస్‌కు తానే హోస్ట్‌గా ఉంటానని తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…