Thurumkhanlu : ప్రస్తుత తరుణంలో సినిమా చిన్నదా.. పెద్దదా.. బడ్జెట్ ఎంత ? అన్న విషయంతో సంబంధం లేకుండా కొందరు సినిమాలను తీస్తూ హిట్ కొడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది దర్శకులు, హీరోలు, హీరోయిన్లు ఇలా చిన్న సినిమాలతోనే పరిచయం అయి.. ప్రస్తుతం టాప్ లెవల్‌కు ఎదిగారు. అందులో భాగంగానే మరో సినిమా కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
శివకల్యాణ్ దర్శకుడిగా కేకే సినిమాస్ పతాకంపై కె.కల్యాణ్ రావు నిర్మిస్తున్న తాజా చిత్రం తురుమ్ ఖాన్‌లు. డార్క్ హ్యూమర్ జానర్‌లో రూరల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ రూపుదిద్దుకుంది. ఇందులో శ్రీరామ్ నిమ్మల హీరోగా నటించాడు. అలాగే దేవరాజ్ పాలమూర్, అవినాష్ సుంకర, ఐశ్వర్య, హర్షిత, శ్రీయాంక, విజయ్ సింగంలు కీలక పాత్రల్లో నటించారు. చరణ్ అంబటి ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్‌గా పనిచేశారు.
ఈ మూవీకి గగన్ కేఎస్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. కాగా ఈ మూవీకి చెందిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా లాంచ్ చేశారు. టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీవిష్ణు ఈ మూవీ పోస్టర్‌ను లాంచ్ చేస్తూ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నానని తెలిపారు.
కాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగేలా చేశారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాత శివ కల్యాణ్ మాట్లాడుతూ.. బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు ఒకే ఊరిలో పుట్టి గొడవపడుతూ లలిత, భారతి, పద్మ అనే అమ్మాయిలను చేరుకునేందుకు ఆరాట పడుతుంటారు. ఈ క్రమంలో అదే ఊరికి చెందిన శ్రీకృష్ణుడు వారి సమస్యలను ఎలా పరిష్కరించాడు.. అన్నదే తురుమ్ ఖాన్‌లు చిత్ర కథ అని తెలియజేశారు. కాగా ఆయన వ్యాఖ్యలతో ఈ మూవీపై మరింత ఆసక్తి పెరిగిందని చెప్పవచ్చు. సినిమా ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కచ్చితంగా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…