Nalla Thumma Chettu : మన చుట్టూ ఉండే అనేక రకాల వృక్ష జాతుల్లో నల్ల తుమ్మ చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టును మనలో చాలా మంది చూసే ఉంటారు. ఈ చెట్టుకు ముళ్లతో కూడిన కొమ్మలు, నల్లని బెరడు, పసుపు రంగు పూలు ఉంటాయి. దీనిని ఆంగ్లంలో గమ్ అరబిక్ ట్రీ అని పిలుస్తారు. నల్ల తుమ్మ చెట్టులో ప్రతిభాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో నల్ల తుమ్మ చెట్టు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నల్ల తుమ్మ చెట్టు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల తుమ్మచెట్టు పుల్ల దంత సమస్యలకు దివ్యౌషధంగా పని చేస్తుంది. తుమ్మ పుల్లతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాల సమస్యలన్నీ తొలగిపోతాయి. దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ నల్ల తుమ్మచెట్టు బెరడును నమలడం వల్ల దంతాల సమస్యలతోపాటు నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. నల్ల తుమ్మ జిగురును నీటిలో నానబెట్టి ఆ నీటితో పాదాలను కడుక్కోవడం వల్ల పాదాల పగుళ్లు తగ్గుతాయి. అంతేకాకుండా పాదాలు నిగారింపును సొంతం చేసుకుంటాయి. ఎండిన తుమ్మ ఆకుల పొడిని గాయాలపై, పుండ్లపై రాయడం వల్ల అవి త్వరగా మానుతాయి. నల్ల తుమ్మ ఆకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
తుమ్మ బెరడుతో చేసిన కషాయంలో సైంధవ లవణాన్ని కలిపి పుక్కిలించడం వల్ల టాన్సిల్స్ వల్ల కలిగే నొప్పి తగ్గుతుంది. నల్ల తుమ్మ చెట్టు బెరడును నీటితో కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని చర్మ వ్యాధులు ఉన్న చోట రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. డయేరియాతో బాధపడే వారికి తుమ్మ చెట్టు ఆకులు ఎంతగానో సహాయపడతాయి. తుమ్మ ఆకులను, జీలకర్రను, వామును కలిపి నీటిలో వేసి మరిగించాలి. ఈ నీటిని వడకట్టి కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటే డయేరియా తగ్గుతుంది. తుమ్మ బెరడు కషాయాన్ని నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేయడం వల్ల చర్మం కాంతివంతంగా తయారువుతుంది.
లేత తుమ్మ ఆకులను మెత్తగా నూరి నీటిలో కలిపి తాగడం వల్ల నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. నల్ల తుమ్మ కాయల పొడిని, తుమ్మ జిగురు పొడిని సమపాళ్లలో తీసుకుని రెండింటినీ కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఒక టీ స్పూన్ మోతాదుగా తేనెతో కలిపి తీసుకోవడం వల్ల విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. నల్ల తుమ్మ కాయలను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడికి పటిక బెల్లం పొడిని కలిపి చిన్న ఉండగా చేసి రోజూ తీసుకోవడం వల్ల పురుషుల్లో వచ్చే స్వప్న స్కలనాల సమస్యతోపాటు శీఘ్రస్కలనం సమస్య కూడా తగ్గుతుంది. ఈ విధంగా నల్ల తుమ్మ చెట్టు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…