Anasuya : బుల్లితెరపై ఎంతో సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతున్న షోలలో జబర్దస్త్ ఒకటి. ఈ షోకు ఎంతో మంది కమెడియన్లు వచ్చి వెళ్లిపోయారు. అయితే నాగబాబు వెళ్లిన తరువాత మళ్లీ ఇన్ని రోజులకు జబర్దస్త్ లో ఒక భారీ కుదుపు వచ్చేసింది. రోజా, తరువాత కమెడియన్లు ఆది, సుధీర్, గెటప్ శ్రీను.. ఇలా అందరూ వరుస పెట్టి జబర్దస్త్‌కు వీడ్కోలు పలికారు. అయితే కిరాక్ ఆర్‌పీ ఈమధ్య కాలంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో కొందరు ఆర్‌పీని సపోర్ట్ చేయగా.. కొందరు మాత్రం మల్లెమాలకు మద్దతు పలికారు. ఇక ఇదిలా ఉండగా.. తాజాగా అనసూయ కూడా జబర్దస్త్‌కు అధికారికంగా గుడ్ బై చెప్పేసింది. ఈ క్రమంలోనే ఆమె వీడ్కోలు ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది.
ఇక వీడ్కోలు ఇస్తున్న సందర్భంగా అనసూయ పేరిట ఓ స్కిట్ చేశారు. అందులో టీమ్ సభ్యులు అనసూయను బతిమాలారు. నెలలో మూడు రోజులు అయినా సమయం కేటాయించలేవా.. అని అడిగారు. అందుకు అనసూయ కష్టమని సమాధానం చెప్పింది. దీంతో కన్నీటితో ఆమెకు వీడ్కోలు పలికారు. జడ్జి ఇంద్రజ కూడా భావోద్వేగానికి గురైంది. అలాగే టీమ్ సభ్యులు కూడా జబర్దస్త్ పర్మినెంట్ అని.. ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారని అన్నారు. ఇక అనసూయ జూన్ నెలలోనే తాను జబర్దస్త్‌కు గుడ్ బై చెబుతున్నట్లు పరోక్షంగా చెప్పింది.
తాను తన కెరీర్‌లో కీలకమైన నిర్ణయం తీసుకున్నానని.. ఇకపై కూడా మీ మద్దతు నాకు ఉంటుందని ఆశిస్తున్నానని.. గత నెలలో అనసూయ తెలియజేసింది. దీంతో ఆమె కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆమె జబర్దస్త్‌ను విడిచిపెడుతుందని.. అందుకనే అలాంటి కామెంట్స్ చేసిందని అన్నారు. అయితే అదే నిజమైంది. ఆమె అధికారికంగా ఈ షోకు వీడ్కోలు పలికింది. ఆమెకు సినిమాల్లో ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయని తెలిసింది. కనుకనే ఇకపై టీవీ షోలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రముఖ యాంకర్‌గా పేరున్న అనసూయ కూడా వెళ్లిపోవడంతో ఇక జబర్దస్త్‌కు ఉన్న ఇంకాస్త కళ కూడా తప్పినట్లే అని అంటున్నారు. మరి రేటింగ్స్ ఎలా వస్తాయో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…